టిక్‌టాక్ భార్గవ్ నిజరూపం బయటపెట్టిన పోలీసులు

Fun Bucket Bhargav Has Arrested - Sakshi

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన ఫన్ బకెట్ ఫేం భార్గవ్ ను అరెస్ట్ చేసినట్టు విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్  తెలిపారు. చెల్లి అంటూ దగ్గరై టీవీ చానల్స్ లో అవకాశం ఇస్తానంటూ మైనర్‌తో అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితు నిపై అత్యాచారం తోపాటు ఫోక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు.

 టిక్ టాక్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న భార్గవ్.. టిక్ టాక్ లో స్టార్ చేస్తానని, ఇతర మీడియా చానెల్స్ లో చాన్సులు ఇప్పిస్తానని బాలికకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అయితే ఆ బాలిక నో చెప్పింది. అయినా భార్గవ్ బాలికను వదల్లేదు. వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బాలికను బ్లాక్ మెయిల్ చేసిన భార్గవ్, శారీరకంగా అనుభవించాడని పోలీసులు తెలిపారు. టిక్ టాక్ భార్గవ్‌ ను హైదరాబాదులో అరెస్ట్ చేసి విశాఖపట్నం తీసుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిందితుడిపై ఇతర ఫిర్యాదులు ఉంటే బాధితులు పోలీసులను ఆశ్రయించారని ఏసీపీ కాజల్‌ సూచించారు.
చదవండి:
చెల్లీ అని పిలుస్తూనే.. మైనర్‌ బాలికపై అత్యాచారం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top