భార్యతో స్టార్‌ హీరో డ్యాన్స్‌.. తలపై గ్లాసు పెట్టుకుని.. | Filmfare 2024: Ranbir Kapoor Dances With Alia Bhatt | Sakshi
Sakshi News home page

Ranbir Kapoor-Alia Bhatt: భార్యతో స్టార్‌ హీరో డ్యాన్స్‌.. ఆప్యాయంగా ముద్దాడుతూ..

Jan 29 2024 12:03 PM | Updated on Jan 29 2024 1:41 PM

Filmfare 2024: Ranbir Kapoor Dances With Alia Bhatt - Sakshi

అవార్డుల వేడుకలో ఈ దంపతులు డ్యాన్స్‌తో కనువిందు చేశారు. అంతేనా.. యానిమల్‌ సినిమాలో హైలెట్‌ అయిన జమల్‌ కుదు హుక్‌ స్టెప్‌ను రీక్రియేట్‌ చేశాడు రణ్‌బీర్‌.

బాలీవుడ్‌ పవర్‌ఫుల్‌ కపుల్‌ రణ్‌బీర్‌ కపూర్‌- ఆలియా భట్‌ అరుదైన ఘనత సాధించారు. 69వ ఫిలింఫేర్‌ అవార్డుల్లో ఇద్దరూ ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్లుగా పురస్కారాలు అందుకున్నారు. దీంతో సంతోషంలో మునిగి తేలుతోందీ జంట. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ దంపతులు డ్యాన్స్‌తో కనువిందు చేశారు. అంతేనా.. యానిమల్‌ సినిమాలో హైలెట్‌ అయిన 'జమల్‌ కుదు' హుక్‌ స్టెప్‌ను రీక్రియేట్‌ చేశాడు రణ్‌బీర్‌.

స్టేడియం ముందు వరుసలో ఉన్న భార్య దగ్గరకు వచ్చి చిందులేశాడు. తలపై గ్లాసు పెట్టుకుని డ్యాన్స్‌ చేశాడు. దీంతో ఆలియా కూడా భర్తతో కలిసి పాదం కదిపింది. ఈ జోష్‌లో భార్యను ఆప్యాయంగా ముద్దాడాడు హీరో. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మీ జంటను చూస్తే ముచ్చటేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా 'యానిమల్‌' సినిమాకుగానూ రణ్‌బీర్‌ ఉత్తమ నటుడిగా, 'రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహాని' చిత్రానికిగానూ ఆలియా భట్‌ ఉత్త నటిగా అవార్డులు అందుకున్నారు.

ఫిలింఫేర్‌ అవార్డులు ఏయే సినిమాలకు వచ్చాయో తెలియాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement