ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి ‘గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం’

Film Journalist Dheeraj Appaji Received Gidugu Ramamurthy Panthulu Award - Sakshi

సినిమా జర్నలిజంలో  చేస్తున్న కృషికి గాను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీని ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం వరించింది. ‘వాడుక భాషా ఉద్యమ  పితామహుడు’ గిడుగు రామ్మూర్తి పంతులు 83వ వర్ధంతిని పురస్కరించుకుని... ‘శంకరం వేదిక’తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో అప్పాజీ ఈ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డా.జి.రాధారాణి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, ఇన్‌కమ్‌ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య - కళ - సేవా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న పలువురికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షురాలు ‘గిడుగు కాంతికృష్ణ’,  ప్రముఖ పాత్రికేయులు - కవి - కళారత్న డా.బిక్కిన కృష్ణ, ‘శంకరం వేదిక’ అధ్యక్షురాలు యలవర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top