
సినిమాలు తీయడం అనేది జూదం లాంటిది. వస్తే భారీ లాభాలు. లేదంటే భారీ నష్టాలు. కొన్నిసార్లు మాత్రం ఊహించని సక్సెస్, కోట్ల కొద్దీ కలెక్షన్ వస్తుంటాయి. తాజాగా రిలీజైన సినిమాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగులో 'లిటిల్ హార్ట్స్' ఎంతలా సంచలనం సృష్టిస్తుందో చూస్తునే ఉన్నాం. దీని కంటే ముందు రిలీజైన ఓ మలయాళ చిత్రం కూడా ఊహించని వసూళ్లతో రికార్డ్స్ బద్దలుకొడుతుంది. ఈ మూవీ గురించి హీరో కమ్ నిర్మాత దుల్కర్ సల్మాన్ ఆసక్తికర విషయాలు చెప్పాడు.
(ఇదీ చదవండి: కోర్ట్‌ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?)
'నిర్మాతగా 'లోక' కోసం పెట్టిందంతా నష్టపోతానని అనుకున్నాను. స్టోరీ బాగా నచ్చింది. మంచి సినిమా అవుతుందని తెలుసు. కానీ బడ్జెట్ ఎక్కువైపోయింది. మలయాళంలో ఇంత బడ్జెట్ చాలా రిస్క్. కానీ కథని నమ్మి పెట్టాను. థియేటర్లలో రిలీజ్ చేద్దామంటే డిస్ట్రిబ్యూటర్స్ అంతగా ఆసక్తి చూపించలేదు. లోక ఫ్రాంచైజీ మొదలుపెడితే సీక్వెల్స్‌తో లాభాలొస్తాయని అనుకున్నాను. ఆ నమ్మకంతోనే రిలీజ్ చేశాం. కానీ ఈ సక్సెస్ మాత్రం ఊహించలేదు. మొదటిరోజు నుంచే సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్‌తో సెన్సేషన్ సృష్టిస్తోంది. మా సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది' అని దుల్కర్.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మలయాళంలో వచ్చిన తొలి లేడీ సూపర్ హీరో సినిమా ఇది. తెలుగులోనూ దీన్ని 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు గానీ ఇక్కడ ఓ మాదిరిగానే లాభపడింది. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకుడు కాగా.. ఇందులో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, సౌబిన్ షాహిర్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించారు. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్లలో రెస్పాన్స్ వస్తుండటం విశేషం.
(ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!)
"As Producer, we thought that we'll lose money on #Lokah😳. we know it's good film, but Budget is high & Buyers are not interested🙁. I thought if this franchise is established, we might do profit🤞. But this success was unimaginable🥶♥️"
- #DulquerSalmaanpic.twitter.com/pmy1Bum8a1— AmuthaBharathi (@CinemaWithAB) September 15, 2025