అలాంటి విమర్శలు పట్టించుకోను, వారికి నా సమాధానం ఇదే!

Divi Vadthya Comments On Who Trolls On Her Dance - Sakshi

సొట్ట బుగ్గ‌ల‌తో బిగ్‌బాస్ ప్రేమికుల‌ను ఆక‌ర్షించింది కంటెస్టెంట్‌ దివి వైద్య‌. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, అందంతో హౌజ్​లో తనకంటు ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ అమ్మడు. బిగ్‌బాస్‌కు ముందే వెండితెరపై మెరిసినా దివికి అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. కానీ బిగ్‌బాస్‌ ఎంట్రీ తర్వాత ఆమె క్రేజ్‌ అమాంతం పెరిగింది. ఈ షో అనంతరం ఆమెకు హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇదే ఆమె కోరిక అని దివి ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

హాట్‌ హాట్‌గా ఫొటో షూట్‌లకు ఫోజులు ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ భామ, ఇటీవల హైదరాబాద్‌ మోస్ట్‌ డిజైరబుల్‌(TV)-2020 టైటిల్‌ గెలుచుకుని దర్శక- నిర్మాతల దృష్టిని ఆకర్శించింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన దివి గ్లామర్‌ ప్రపంచంలో తనకు గుర్తింపు అంత సులభంగా రాలేదని తెలిపింది. మోస్ట్‌ డిసైరబుల్‌ టైటిల్‌ను గెలుచుకున్నట్లు తనకు ఫోన్‌ రాగానే ఉక్కిరిబిక్కిరి అయిపోయానని, ఆ ఆనందం తట్టుకోలేకపోయానని పేర్కొంది. అయితే ‘నటపై ఉన్న ఆసక్తితో ఆడిషన్స్‌కు వెళ్లగా ప్రతిసారి రిజెక్ట్‌ అయ్యాను. అలా ఒక 100పైగా ఆడిషన్స్‌లో నన్ను తిరస్కరించారు. ఆడిషన్స్‌లో పరాభవం ఎదుర్కొన్న ప్రతిసారి నేను మరింత స్ట్రాంగ్‌ అయ్యాను. అయితే మహర్షితో పాటు పలు చిత్రాల్లో నటించిన నేను ఎవరనేది ఎవరికి తెలియదు.

కానీ ఇప్పుడు దివి అంటే అందరికి తెలుసు. ‘ఈ క్రమంలో నాకు పెద్ద సినిమాలు, హీరోతో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇది నిజంగా సంతోషంగా ఉంది. నేను నెక్ట్స్‌ చిరంజీవి గారి సినిమాలో న‌టిస్తున్నా. మ‌రో మూడు నెల‌ల్లో షూటింగ్ మొద‌లు కానుంది. పెద్ద స్టార్ల చిత్రాల‌లో న‌టించాల‌ని నాకు కోరిక, అంతేగాక మంచి ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. ఈ రోజు కోస‌మే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా. క‌ష్ట‌ప‌డితే త‌ప్ప‌కుండా ఫలితం వస్తుంది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఇటీవల దివి సిలక ముక్కు దానా అనే ప్రైవేటు సాంగ్‌లో మెరిసి మాస్‌ స్టేప్పులతో అలరించిన సంగతి తెలిసిందే. ఈ పాట సూప‌ర్ హిట్‌గా నిలిచి 1.7 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ రాబ‌ట్టింది.

అయితే ఇందులో దివి సరిగా డ్యాన్స్‌ చేయలేదని, తనకు డ్యాన్స్‌ రాదంటూ విమర్శలు చేస్తూ కామెంట్స్‌ వచ్చాయి. ఈ సందర్భంగా ఈ విమర్శలపై ఆమె స్పందిస్తూ.. ‘ఈ పాట కోసం, డ్యాన్స్‌ కోసం నేను ఎంతగ కష్టపడ్డానో నాకే తెలుసు. ఇంత కష్టం నేనేప్పుడు పడలేదు. నాకు మోకాలి నొప్పులు వచ్చినా తట్టుకుని డ్యాన్స్‌ చేశాను. ఇక నా డ్యాన్స్‌పై వస్తున్న విమర్శలను నేను పట్టించుకోను. అలాంటి వారిక ఈ పాట సాధించిన విజయం, వ్యూసే సమాధానం’ అంటూ విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. కాగా ఈ పాటను కాస‌ర్ల శ్యామ్ రాయగా.. హారిక నారాయ‌ణ్ పాడింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top