Director Luv Ranjan Marriage With His Girl Friend, Plans Of Destination Wedding - Sakshi
Sakshi News home page

Luv Ranjan Marriage: ప్రేయసితో దర్శకుడి వివాహం, ముహూర్తం ఫిక్స్‌!

Feb 12 2022 1:29 PM | Updated on Feb 12 2022 2:49 PM

Director Luv Ranjan Marriage With His Girl Friend, Plans Of Destination Wedding - Sakshi

'ప్యార్‌ కా పంచనామా' డైరెక్టర్‌ లవ్‌ రంజన్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడు తన ప్రేయసితో వైవాహిక జీవితాన్ని ఆరంభించబోతున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరి 18 నుంచి ఈ పెళ్లి పనులు షురూ అవుతాయని, 20వ తేదీన వివాహ వేడుక జరగనుందని సమాచారం! ఈ నేపథ్యంలో అతడు తను దర్శకత్వం వహిస్తున్న రణ్‌బీర్‌ కపూర్‌- శ్రద్ధా కపూర్‌ల సినిమా షూటింగ్‌కు కొంతకాలం పాటు బ్రేక్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వెడ్డింగ్‌ డ్రెస్‌ కోసం ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రాను సంప్రదించిన ఈ ప్రేమజంట వారికి నచ్చినట్లుగా కాస్ట్యూమ్స్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి వీరి పెళ్లి జనవరిలోనే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడక తప్పలేదు. దీంతో ఫిబ్రవరిలోనే ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు డైరెక్టర్‌. కాగా లవ్‌ రంజన్‌ 'ప్యార్‌ కా పంచానామ', 'సోనూ కీ టీటూ కి స్వీటీ', 'దేదే ప్యార్‌ దే', 'ఆకాశవాణి' వంటి చిత్రాలతో పాపులర్‌ అయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement