Jaan Say: పూరీ జగన్నాథ్‌ సినిమాలంటే ఇష్టం: జాన్‌ సే డైరెక్టర్‌

Director Kiran Kumar Interesting Comments On His Movie Jaan Say - Sakshi

కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జాన్‌సే. అంకిత్, తన్వి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు చిత్ర విశేషాలు, తన ఆలోచనలను పంచుకున్నారు. 

జాన్ సే.. క్రైమ్ థ్రిల్లర్ స్టొరీ అయినా మంచి లవ్ స్టొరీ ఉంది. జాన్ సే అనేది ప్రేమను రిఫ్లెక్ట్ చేసే హిందీ టైటిల్ లాగా జాన్ Say(చెప్తుంది) అనేది ఇంకోలాగా సౌండింగ్ ఉంటుంది.

► నేను అనుకునే కథలను, ఆలోచనలను సినిమా రూపంలో చెప్పాలనే ఆసక్తే నన్ను దర్శకుడిని చేసింది. ఈ జాన్ సే లైన్‌ను తొమ్మిది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఆరు నెలల క్రితం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి తెలివి, ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ కలిపి ఉండే అమ్మాయి ఈ సొసైటీని ఎలా ఫేస్ చేస్తుంది? అనేది మెయిన్ లైన్. 

నాకు చిత్ర పరిశ్రమ తో ఎలాంటి సంబంధం లేకపోయినా కథను నమ్ముకుని సినిమా తీస్తున్నాను. కానీ పోను పోను ఇది ఒక పెద్ద సముద్రమంత ప్రాసెస్ అని అర్థమవుతోంది. లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే ముందుకు వెళ్లలేం అని నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఈ సముద్రాన్ని ఈదుతున్నాను.

పూరి జగన్నాథ్ డైరెక్ట్‌ చేసిన సినిమాలంటే ఇష్టం. దర్శకుడిగా నాకూ సొంత మార్క్ ఉండాలనుకుంటాను.

ఈ సినిమాకి కథే ప్రధాన బలం. ఆడియెన్స్ కి నచ్చేలా ఉంటుంది. వాళ్ళను థియేటర్‌కు రప్పించడానికి మంచి ప్రమోషన్స్ ప్లాన్ చేశాము. వన్స్ థియేటర్‌కు వచ్చాక సినిమాతో వాళ్ళని ఆకట్టుకుంటామనే నమ్మకం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒక రెండు నెలల్లో రిలీజ్ ఉంటుంది.

నేను రూ.10 కోట్ల బడ్జెట్ అనుకున్నాను. అనుకున్న దానికంటే తక్కువలోనే పూర్తి చేయగలిగాను. ఇక షూటింగ్‌లో సమస్యల విషయానికి వస్తే ఆర్టిస్ట్స్ డేట్స్ అడ్జెస్ట్ అవకపోవడం, ఒక రెస్టారెంట్ సీన్ కోసం టైం లిమిట్ ఉండడం లాంటి చిన్న చిన్న ఇష్యూస్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఎదురవలేదు.

ఇందులో సీనియర్‌ యాక్టర్స్‌ తనికెళ్ళ భరణి, సూర్య, అజయ్, బెనర్జీ, అంజలి లాంటి ఆర్టిస్టులు ఉన్నారు. 

నా జర్నీలో మా కెమెరామన్ మోహన్ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆయన చివరి వరకు ఉండి అన్నీ చూసుకున్నారు. ప్రొడ్యూసర్ రఘు కూడా బాగా సపోర్ట్ చేశారు.

నేను డబ్బులు ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయడం లేదు. నేను ఈ సినిమాకి పెట్టిన డబ్బు వచ్చేస్తే మరో సినిమా మొదలు పెట్టేస్తాను.

జాన్ సే టైటిల్ చివర ఉన్న త్రీ డాట్స్ ముగ్గురు వ్యక్తుల జీవితాల్ని ఇండికేట్ చేస్తాయి. అందులో ఇద్దరి పాత్రలను త్వరలో పరిచయం చేస్తాను. మూడో పాత్ర మాత్రం సస్పెన్స్. సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే!

చదవండి: తల్లి గొంతు విని శ్రీసత్య ఎమోషనల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top