పార్థ గోపాల్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. సూర్య జి. యాదవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘన హీరోయిన్‌గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు(ఏప్రిల్10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఒక మనిషిని రక్షించేందుకు ప్రయత్నించిన గోపాల్ కుటుంబం చిన్నాభిన్నాం అవుతుంది. భయంకర డెకాయిట్‌గా పేరు తెచ్చుకున్న మునుస్వామి నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా ఎదుగుతాడు. జైలు నుంచి విడుదలైన గోపాల్ అతని గ్యాంగ్‌లో చేరుతాడు. అయితే బయటకు అతను మునుస్వామి నాయుడికి నమ్మకస్తుడిగా కనిపించినా, లోపల మాత్రం అమాయకులను రక్షిస్తూ డబుల్ లైఫ్ గడుపుతుంటాడు. గోపాల్ గతంలో ఎందుకు జైలుకు వెళ్లాడు? అతని అసలు లక్ష్యం ఏమిటి? వరుస హత్యలు, మరో హత్యా యత్నం వెనుక ఉన్న నిజం ఏమిటి? గోపాల్ ఎందుకు బండిపోటుగా మారుతాడు? చివరకు బయటపడే నిజాలు కథకు కీలకం అవుతాయి.
ఎలా ఉందంటే..
క్రైమ్, యాక్షన్, సెంటిమెంట్ కలయికతో రూపొందిన కుటుంబ కథా చిత్రమిది. యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, సినిమా అంతర్లీనంగా ఒక హృద్యమైన ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటాయి. దర్శకుడు సూర్య జి. యాదవ్ కథను నడిపించిన తీరు బాగుంది.అసలు కథను ప్రారంభించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నా, ఆ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగించాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినా.. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. స్క్రిన్‌ప్లేని మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
హీరోగా, నిర్మాతగా పార్ధ గోపాల్ రెండు విభాగాలకు న్యాయం చేశాడు. నిర్మాతగా ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరోగా బాగానే నటించాడు. యాక్షన్‌తో ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించాడు. దర్శకుడు సూర్య జి. యాదవ్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలతో సినిమాను భావోద్వేగపూరితంగా తెరకెక్కించారు.సాయి రాజు రాసిన డైలాగ్స్ సహజం ఉన్నాయి. : పీఆర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్.గోపాల్ కుటుంబం ఊరి నుంచి వెళ్లిపోయే ముందు వచ్చే పాటు బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-రేటింగ్: 2.5/5


