దురంధర్‌-2 క్రేజ్.. పుష్పరాజ్‌ రికార్డ్ బ్రేక్ | Dhurandhar 2 Box Office Day 5 Crossed Pushpa 2 Hindi Collections | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Box Office: దురంధర్‌-2 క్రేజ్.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్

Mar 24 2026 3:26 PM | Updated on Mar 24 2026 3:39 PM

Dhurandhar 2 Box Office Day 5 Crossed Pushpa 2 Hindi Collections

రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ రికార్డుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదు రోజులైనా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే జోరు కొనసాగితే కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఈ సారి ఏకంగా అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన పుష్ప-2 వసూళ్లను దాటేసింది. పుష్ప-2 సాధించిన హిందీ వసూళ్లు రికార్డ్‌ను దురంధర్-2 బద్దలు కొట్టింది. పుష్ప-2 మూవీకి నాలుగు రోజుల్లో హిందీ వర్షన్‌కు రూ. 425.10 కోట్లు రాగా.. దురంధర్‌-2 ఏకంగా రూ.430 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డుతో పుష్పరాజ్‌ను వెనక్కి నెట్టేసింది. దురంధర్-2, పుష్ప-2 తర్వాత పఠాన్, జవాన్, స్త్రీ-2 చిత్రాలు ఉన్నాయి. ఓవరాల్‌గా అన్ని భాషల్లో ఇండియా వ్యాప్తంగా కలెక్షన్స్ పరిశీలిస్తే 'పుష్ప 2: ది రూల్' ఇంకా అగ్రస్థానంలోనే ఉంది. హిందీ వెర్షన్‌లో 'ధురందర్: ది రివెంజ్' అధిగమించింది.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లోనే రూ.829 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఐదు రోజుల్లోనే దేశ వ్యాప్తంగా ఈ సినిమా రూ.619.76 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా చూస్తే రూ. 519.12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఒక హిందీ చిత్రానికి ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్, గౌరవ్ గెరా  కీలక పాత్రలు పోషించారు. 

హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన  టాప్-5  సినిమాలివే.. 

  • దురంధర్ ది రివెంట్: రూ. 430 కోట్లు (నాలుగు రోజులు)
  • పుష్ప-2 ది రూల్: రూ. 425.10 కోట్లు
  • పఠాన్: రూ. 351 కోట్లు
  • జవాన్: రూ. 346.98 కోట్లు
  • స్త్రీ-2: రూ. 291.65 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement