హాలీవుడ్‌ సినిమా.. ధనుష్ అమెరికా ప్రయాణం | Dhanush to join Ryan Gosling, Chris Evans in Russo Brothers | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ సినిమా.. ధనుష్ అమెరికా ప్రయాణం

Feb 8 2021 5:49 AM | Updated on Feb 8 2021 7:21 AM

Dhanush to join Ryan Gosling, Chris Evans in Russo Brothers - Sakshi

రెండు నెలల పాటు అమెరికాకి మకాం మార్చనున్నారు ధనుష్‌. హాలీవుడ్‌ సినిమా కోసమే ఈ అమెరికా ప్రయాణం. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ చిత్ర దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్‌ దర్శకత్వంలో ‘ది గ్రే మ్యాన్‌’ అనే యాక్షన్‌ చిత్రం తెరకెక్కనుంది. ర్యాన్‌ గోస్లింగ్, క్రిస్‌ ఈవెన్స్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ధనుష్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రీకరణలో పాల్గొనడానికి అమెరికా వెళ్తున్నారు ధనుష్‌. ఈ రెండు నెలల్లో తన భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకొని తిరిగొస్తారట ఆయన. ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ తర్వాత ధనుష్‌ చేస్తున్న రెండో హాలీవుడ్‌ చిత్రమిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement