Devatha Serial Today Episode May 10th: నందా-సత్యలపై రుక్మిణికి అనుమానం - Sakshi
Sakshi News home page

నందా-సత్యలపై రుక్మిణికి అనుమానం

May 10 2021 3:31 PM | Updated on May 10 2021 6:00 PM

Devatha Serial : Adithya Gets Furious With Nanda Behaviour - Sakshi

నందా-సత్యల సఖ్యతపై రుక్మిణి అనుమానం వ్యక్తం చేస్తుంది. సత్యను విడచి వెళ్లాల్సిందిగా ఆదిత్య నందాను కోరతాడు. 10 లక్షల రూపాయల చెక్కును కూడా అందిస్తాడు. మరి నందా ఆ డబ్బులను తీసుకొని వెళ్లిపోతాడా? నందాపై అనుమానం వచ్చిన కనకం ఏం చేస్తుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో దేవత ఎపిసోడ్‌ 229వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

అత్యమ్మ లేకపోతే ఇళ్లంతా బోసిపోయిందని రుక్మిణి ఆదిత్యతో అంటుండగా నందా ఎంటర్‌ అ‍య్యాడు. కావాలని మాట కలుపుదామని ట్రై చేసి రుక్మిణి ముందు బుక్కవుతాడు. మీరు లేకపోతే కూడా ఇళ్లంతా ఇలాగే ఉంటుందని,అన్నయ్య(ఆదిత్య)కు కూడా ఏమీ తోచదని రుక్మిణిని ఉద్దేశించి అంటాడు.  సత్య కూడా ఏదో పొగొట్టుకున్నట్లు ఉంటుందని చెప్తాడు. అయితే సత్య, నువ్వు మాట్లాడునుకేది ఈ ఇంట్లో ఇంత వరకు చూడలేదు అని రుక్మిణి అనుమానం వ్యక్తం చేయగా, దేవాలయం లాంటి ఈ ఇంట్లో పెళ్లి కాకుండా మాట్లాడటం కరెక్ట్‌ కాదు అని యాక్టింగ్‌ చేస్తాడు నందా. తానెక్కడ దొరికిపోతానో అని కంగారు పడతాడు. రుక్మిణికి అనుమానం మొదలైందని, త్వరలోనే నీ గుట్టు రట్టవుతుందని ఆదిత్య నందాకు వార్నింగ్‌ ఇస్తాడు. 


ఇక సీన్‌ కట్‌ చేస్తే ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే ఇంట్లోనే మాట్లాడమని, బయటకు వెళ్లొద్దని రుక్మిణి సత్యతో అంటుంది. ఇక నందా గురించి ఆలోచిస్తూ తన జీవితం నాశనమైపోయిందంని భాదపడుతుంటుంది సత్య. ఇక నందా ఎలాంటివాడో తెలుసుకోవాలని కనకం ఆదిత్యను ప్రశ్నలడుగుతుంటుంది. కాలేజీ రోజుల్లో ఎలా ఉండేవాడు అంటూ ఎంక్వైరీ చేయగా, కూల్‌గా అక్కడ్నుంచి తప్పించుకుంటాడు ఆదిత్య. సీన్‌ కట్‌ చేస్తే.. మాట్లాడాలని చెప్పి సత్య, నందాను టెర్రస్‌ మీదకి పిలుస్తాడు ఆదిత్య. ఈ డ్రామాలు ఆపేసి సత్యని వదిలేయాల్సిందిగా ఆదిత్య నందాను కోరతాడు. ఇందుకు 10 లక్షల రూపాయల చెక్కును అందిస్తాడు. ఇది చూసిన నందా నీ ప్రేమ గొప్పది..నీ మనసు గొప్పదంటూ ఆదిత్యను ప్రశంసిస్తాడు. ఇక వచ్చిన రోజే ఈ చెక్కు ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేదని, ఇకపై మీకు కనిపించకుండా వెళ్లిపోతానని నందా ఆదిత్యతో అంటాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement