19 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన 'దంగల్' నటి.. అదే కారణమా? | Dangal Actress Suhani Bhatnagar Passed Away At 19 Years | Sakshi
Sakshi News home page

Suhani Bhatnagar: చిన్న వయసులోనే బాలనటి మృతి

Feb 17 2024 3:14 PM | Updated on Feb 17 2024 3:25 PM

Dangal Actress Suhani Bhatnagar Passed Away At 19 Years - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమా గుర్తుందా? ఇందులో బబిత కుమారిగా నటించిన బాలనటి చిన్న వయసులోనే కన‍్నుమూసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో విషాదం నింపింది. మరీ 19 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలేయడంపై అందరూ షాక్‌కి గురవుతున్నారు.

(ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

సుహానీ భట్నాగర్.. 'దంగల్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. రెండో కూతురు బబిత కుమారి ఫోగట్ పాత్రలో ఆకట్టుకుంది. దీని తర్వాత 'బల్లే ట్రూప్' అనే మరో చిత్రంలో నటించింది. ఆ తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టి చదువుకుంటోంది. తాజాగా ఈమెకు ప్రమాదం జరగ్గా కాలు విరిగింది. 

చికిత్స తీసుకునే క్రమంలోనే ఈమె ఉపయోగించిన మెడిసన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, ఈ క్రమంలోనే దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతికి కారణాలు ఏంటనేది క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా మరీ 19 ఏళ్ల చిన్న వయసులోనే ఇలా నటి సుహానా ప్రాణాలు విడవటంతో పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: రాజధాని ‘ఫెయిల్స్‌’.. బాబు ‘భ్రమరావతి’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement