
ప్రముఖ ఆర్జే మహ్‌వశ్ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కనిపించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. కానీ తమపై వస్తున్న కథనాలపై ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్న చాహల్ ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చేశాడు. తను ఎవరో మీ అందరికీ ఇప్పటికే తెలుసుగా అంటూ చాహల్ తన మనసులో మాట చెప్పేశాడు. దీంతో ఈ జంట డేటింగ్ నిజమేనంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలోనే చాహల్, ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. లండన్‌లో ఈ ప్రేమజంట చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు తమ ఇన్స్టా వేదికగా షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్‌లో లోకేషన్ ఓకేలా కనిపిస్తోంది. దీంతో ఈ లవ్ బర్డ్స్ తాజాగా లండన్‌లోనే వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాహల్ ఫోటోలు చూసిన ఓ నెటిజన్ మహ్‌వశ్ బాబీ తీశారా అంటూ కామెంట్ చేశాడు. వారిద్దరు డేటింగ్ చేస్తున్నారని నాకు తెలుసు అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
చాహల్, మహ్వశ్పై డేటింగ్ రూమర్స్
క్రికెటర్ చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే మహ్‌వశ్, చాహల్ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్‌లో జంటగా కనిపించడం.. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ కింగ్స్ టీమ్‌కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది.