మాటల్లో చెప్పలేను.. నా పూర్వజన్మ సుకృతం: చిరంజీవి | Chiranjeevi Shares Hanuman Jayanti Special Video | Sakshi
Sakshi News home page

మా ఇంట్లో జరిగిన విశేషం.. నా పూర్వజన్మ సుకృతం: చిరంజీవి

Apr 2 2026 1:58 PM | Updated on Apr 2 2026 2:38 PM

Chiranjeevi Shares Hanuman Jayanti Special Video

మెగాస్టార్‌ చిరంజీవి.. ఆంజనేయ స్వామికి పరమభక్తుడు. గురువారం (ఏప్రిల్‌ 2న) హనుమాన్‌ జయంతి సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తన ఇంట్లోని పూజా మందిరంలో సూర్యభగవానుడి కిరణాలు హనుమంతుడి విగ్రహాన్ని తాకాయంటూ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతి ఏడాది..
శ్రీ హనుమాన్‌ జయంతి సందర్భంగా మా పూజామందిరంలో జరిగిన ఓ విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి సంవత్సరం డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి మా పూజామందిరంలో ఉన్న హనుమంతుడిని పై నుంచి కిందివరకు స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను.

పూర్వజన్మ సుకృతం
ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క్‌, అరసవెల్లి దేవాలయాల్లో సూర్యకిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికీ తెలిసిందే! అలాంటి దైవానుభూతి.. మా ఇంట్లో ఆంజనేయుడిని స్పృశించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అందరికీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

 

చదవండి: ఎవరీ మానస శర్మ? ట్రెండింగ్‌లో రాకాస లేడీ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement