Chiranjeevi-Satyadev: ‘ఆచార్య’లో సత్యదేవ్‌ అతిథి పాత్ర, గర్వంగా ఉందన్న చిరు

Chiranjeevi Praises Actor Satyadev as of His Fan Acting In Acharya, Godfather - Sakshi

Chirajeevi Praises Actor Satyadev: నటుడు సత్యదేవ్‌పై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు కురిపించాడు. చిరంజీవి తాజా చిత్రం ఆచార్యలో సత్యదేవ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ‘గాడ్‌ఫాదర్‌’లో కూడా ఓ కీ రోల్‌ పోషిస్తున్నాడు. రీసెంట్‌గా గాడ్‌ఫాదర్‌లో సెట్‌లోకి అడుగు పెట్టాడు సత్యదేవ్‌. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటిస్తూ చిరంజీవితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు సత్యదేవ్‌ ట్వీట్‌ చేశాడు. 

చదవండి: బిగ్‌ సర్‌ప్రైజ్‌, ఆచార‍్యలో అనుష్క స్పెషల్‌ రోల్‌!

‘అన్నయ్యా.. నటన జీవితంతో తమాలాంటి ఎదరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్నిచూసే నటుడిగా మారాను. ఈ రోజు ఆచార్య సినిమాలో మీతోపాటు కాసేపైనా నటించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమ శిక్షణ దగ్గర నుంచి చూఇ నేర్చుకునే అవకాశం దక్కింది’ అంటూ సత్యదేవ్‌, చిరుపై అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక అతడి ట్వీట్‌కు మెగాస్టార్‌ ఫిదా అయ్యాడు. అతడి ట్వీట్‌కు తన అభిమానిగా సత్యదేవ్‌ను చూసి గర్వపడుతున్నానంటూ చిరు స్పందించాడు.

చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్‌ చెప్పిన హీరో

‘డియర్‌ సత్యదేశ్‌. థ్యాంక్యూ. నీలాంటి చక్కటి నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషంగా ఉంది. ఆచార్యలో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. ఇక గాడ్‌ఫాదర్‌ చిత్రంలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం’ అంటూ చిరు రాసుకొచ్చారు. కాగా మెహన్‌ రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌ చిత్రం మలయాళం లూసీఫర్‌ మూవీకి రీమేక్‌. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సత్యదేశ్‌ కీ రోల్‌ పోషిస్తున్నాడు. చిరు తాజా ట్వీట్‌తో సత్యదేవ్‌ ఇందులో ప్రతికథానాయకుడిగా కనిపంచానున్నాడనే ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. కాగా ప్రస్తుతం గాడ్‌ఫాదర్‌ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top