Is Chiranjeevi To Do A Hindi Film with Amitabh Bachchan? - Sakshi
Sakshi News home page

చాలాకాలానికి బాలీవుడ్‌ వైపు చిరంజీవి చూపు..

Mar 10 2021 4:16 PM | Updated on Mar 10 2021 5:23 PM

Chiranjeevi May Sign Hindi Film With Amitabh Bachchan - Sakshi

బిగ్‌బీ తన బాలీవుడ్‌ మూవీలో నటించమని చిరంజీవిని చిరు కోరిక కోరాడట. ఆయన నోరు తెరిచి అడిగాక కాదంటానా? అన్నట్లుగా చిరంజీవి కూడా వెంటనే ఆ కోరికను మన్నించి సినిమాకు అంగీకరించినట్లు

తెలుగులో మెగాస్టార్‌ ఎవరనగానే ఇంకెవరు, టాలీవుడ్‌ బాస్‌ చిరంజీవి అని టపీమని చెప్తారు. హిందీలో మెగాస్టార్‌ ఎవరంటే.. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ అని టక్కున చెప్పేస్తారు. మరి ఈ ఇద్దరు స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఆ కిక్కే వేరు కదూ.. గతంలో 'సైరా నరసింహారెడ్డి'లో అమితాబ్‌.. చిరుకు గురువు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా! తాజాగా బిగ్‌బీ తన బాలీవుడ్‌ మూవీలో నటించమని చిరంజీవిని చిరు కోరిక కోరాడట. ఆయన నోరు తెరిచి అడిగాక కాదంటానా? అన్నట్లుగా చిరంజీవి కూడా వెంటనే ఆ కోరికను మన్నించి సినిమాకు అంగీకరించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. అయితే చిరుది ప్రధాన పాత్రా? లేక గెస్ట్‌ రోలా? అంటూ అభిమానులు బుర్రలు గోక్కుంటున్నారు.

 కాగా చిరంజీవి గతంలోనూ పలు హిందీ చిత్రాల్లో నటించాడు. ప్రతిబంధ్‌, ది జెంటిల్‌మెన్‌, ఆజ్‌ కా గుండా రాజ్‌ వంటి సినిమాల్లో యాక్ట్‌ చేసి అక్కడి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరో హిందీ సినిమాలో కనిపించనున్నట్లు వార్తలు వస్తుండటంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కాగా చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. కాజల్‌ అగర్వాల్‌ ఆయనతో జోడీ కడుతోంది. మెగాస్టార్‌ తనయుడు రామ్‌చరణ్‌ సిద్ధ పాత్రలో కనిపించనున్నాడు. చెర్రీతో పూజా హెగ్డే జోడీ కడుతోంది. ఇందులో సోనూసూద్‌తో పాటు మరో నటుడు కూడా ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. స్పెషల్‌ సాంగ్‌లో హీరోయిన్‌ రెజీనా కసాండ్రాతో స్టెప్పులేయించినట్లు సమాచారం.

చదవండి: ఆచార్య షూటింగ్‌: వీడియో తీసిన ఫ్యాన్స్‌!

మగాడిలా ఉన్నానని కామెంట్‌ చేశారు: అనన్య పాండే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement