
విశ్వంత్ దుద్దుంపూడి, మాళవికా సతీషన్ జంటగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’. వేణుమాధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై ఆసక్తి పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది. మధునందన్, సుదర్శన్, హర్షవర్ధన్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: బాల సరస్వతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశ్రిన్ రెడ్డి.