పెళ్లికి ముందే జాన్వీ కపూర్ పుట్టిందా?.. బోనీ కపూర్ ఏమన్నారంటే? | Boney Kapoor Reveals Janhvi Kapoor Birth Day After Marriage | Sakshi
Sakshi News home page

Boney Kapoor: పెళ్లికి ముందే జాన్వీ కపూర్ పుట్టిందా?.. స్పందించిన బోనీ కపూర్!

Published Tue, Oct 3 2023 6:44 PM | Last Updated on Tue, Oct 3 2023 7:17 PM

Boney Kapoor Reveals Janhvi Kapoor Birth Day After Marriage - Sakshi

అలనాటి అందాల నటి శ్రీదేవి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉ‍న్నారు. ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ సినిమాలతో బిజీగా ఉంది. జూనియర్‌ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీదేవి భర్త బోనీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జాన్వీ కపూర్‌ పుట్టిన రోజుపై వస్తోన్న రూమర్స్‌పై ఆయన స్పందించారు.

(ఇది చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?)
 
గతంలో కూడా జాన్వీకపూర్‌ కూడా వారికి పెళ్లికి ముందే పుట్టారని వార్తలొచ్చాయి. అయితే బోనీ కపూర్ తాజాగా ఇంటర్వ్యూలో ఆ వార్తలపై నోరు విప్పారు. ఆ రూమర్స్ ఎలా వచ్చాయో స్పష్టం చేశారు.  కాగా.. ఇ‍ప్పటికే శ్రీదేవి-బోనీ కపూర్ వివాహంపై ఎన్నో రూమర్స్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. 

బోనీ కపూర్ మాట్లాడుతూ..'నేనూ శ్రీదేవి 1996లో షిర్డిలో రహస్య వివాహం చేసుకున్నాం. కొద్ది నెలలకే మా పెళ్లి విషయాన్ని బయటికి చెప్పాం. ఆ తర్వాత 1997లో జనవరిలో మరోసారి అందరి సమక్షంలో పెళ్లిచేసుకున్నాం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాం కూడా. మాకు జాన్వీ కపూర్‌ 1997 మార్చిలో పుట్టింది. అయితే జాన్వీ మా పెళ్లికి ముందే పుట్టిందని కొన్ని రూమర్స్ వచ్చాయి. అవీ ఇప్పటీకీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. తన పుట్టినరోజు గురించి స్వయంగా నేను చెప్పినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు' అంటూ వెల్లడించారు. అలాగే శ్రీదేవికి దైవభక్తి ఎక్కువని అన్నారు. తన పుట్టినరోజున కచ్చితంగా తిరుమల వెళ్లేవారని తెలిపారు.

(ఇది చదవండి: 'వీళ్లలో చదువుకునే ఫేస్ ఒక్కటైనా ఉందా?'.. ఆసక్తిగా మ్యాడ్ ట్రైలర్!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement