స్పీడ్‌ పెంచిన 'బైకర్'.. మూడు రోజుల కలెక్షన్స్‌ | Biker Movie 3 days Collection | Sakshi
Sakshi News home page

స్పీడ్‌ పెంచిన 'బైకర్'.. మూడు రోజుల కలెక్షన్స్‌

Apr 6 2026 1:31 PM | Updated on Apr 6 2026 1:36 PM

Biker Movie 3 days Collection

శర్వానంద్ తాజా చిత్రం 'బైకర్' భారీ స్పందనతో బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతుంది. భార‌తీయ తొలి మోటోక్రాస్ రేసింగ్ సినిమాగా ఏప్రిల్‌ 3న విడుదలైన ఈ చిత్రం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఈ మూవీలో రేస‌ర్‌గా  శ‌ర్వానంద్, ఆయ‌న‌కు తండ్రిగా సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ న‌టించ‌డంతో బజ్‌ క్రియేట్‌ అయింది. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి త‌దిత‌రులు నటించారు. అయితే, తాజాగా మూడు రోజుల కలెక్షన్స్‌ను మేకర్స్‌ ప్రకటించారు.

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం బైకర్‌ మొదటి వారాంతాన్ని ఘనంగా పూర్తి చేసుకుంది. చిత్ర నిర్మాతల ప్రకారం, ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 18.09 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.  శర్వా కెరీర్‌లో ఉత్తమ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా బైకర్‌ నిలిచింది. బైక్‌ రేసర్‌గా కనిపించేందుకు శర్వానంద్‌ చాలా కష్టపడ్డారని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ మూవీ కోసం ఏకంగా తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. దాదాపు 23 కేజీల బరువు తగ్గడంతోపాటు రేసింగ్‌లో కొన్ని నెలలపాటు శిక్షణ తీసుకున్నారని మేకర్స్‌ చెప్పుకొచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement