బిగ్‌బాస్‌ విన్నర్‌కు బంగారం గిఫ్ట్‌, సూట్‌కేస్‌ తీసుకున్న రాఖీ సావంత్‌

Bigg Boss Marathi 4 Winner: Akshay Kelkar Lifts Trophy, Takes Home Gold Necklace - Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ షో పలు భాషల్లో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇటీవలే తెలుగులో ఆరో సీజన్‌ ముగియగా తాజాగా మరాఠీలో నాలుగో సీజన్‌కు గ్రాండ్‌గా ముగింపు పలికారు. వంద రోజుల పాటు హౌస్‌లో ఉండి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హిందీ నటుడు అక్షయ్‌ కేల్కర్‌ ట్రోఫీ అందుకున్నాడు. యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న అక్షయ్‌ ట్రోఫీతో పాటు గోల్డ్‌ బ్రాస్‌లెట్‌, రూ.15,55,000 నగదు సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌ బెస్ట్‌ కెప్టెన్‌గా అవతరించినందుకుగానూ మరో రూ.5 లక్షలు విలువైన చెక్‌ అందుకున్నాడు.

వంద రోజులపైనే సాగిన ఈ షోకు నటుడు మహేశ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆదివారం జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో అక్షయ్‌ను విన్నర్‌గా ప్రకటించాడు. ఇక ఈ షోలో అపూర్వ నెమ్లేకర్‌ ఫస్ట్‌ రన్నరప్‌గా, కిరణ్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు. వివాదాస్పద నటి రాఖీ సావంత్‌ రూ.9 లక్షలతో పోటీ నుంచి వైదొలగింది. సీజన్‌ విన్నర్‌గా నిలిచిన అక్షయ్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు ఫ్యాన్స్‌.

చదవండి: కేజీఎఫ్‌ సినిమాలో యశ్‌ కనిపించడా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top