బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ భార్య గొప్పమనసు.. వారి కోసం అలా! | Sakshi
Sakshi News home page

Jyothiraj: జ్యోతిరాజ్ గొప్పమనసు.. అలాంటి వారి కోసం!

Published Sun, Dec 31 2023 8:01 AM

Bigg Boss Contestant Aata Sandeep Wife Jyothiraj Done good Job - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, కొరియాగ్రాఫర్ ఆట సందీప్ ఈ సీజన్‌లో తన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకున్నారు. తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7లో మొదటి నుంచి హౌస్‌లో గట్టి పోటీదారునిగా నిలిచారు. ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్‌ సీజన్‌లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. అయితే ఆయన భార్య జ్యోతిరాజ్‌ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే. ఆమె సైతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. 

తాజాగా ఆమె చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే నిద్రిస్తున్న వారికోసం తనవంతు సాయంగా ముందుకు కదిలారు. రోడ్డు పుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారికి దుప్పట్లు అందించారు. తన ఫ్రెండ్‌తో కలిసి ఆమె రోడ్ల పక్కన నిద్రిస్తున్న ఉన్నవారికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్స్ ప్రశంసలు కురిస్తున్నారు. మీరు ఇలాగే మరికొంత మందికి సాయం చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

1/1

Advertisement
Advertisement