గుండెల్లో దమ్ముందా అని అడుగుతోన్న అలీ రెజా

Bigg Boss Ali Reza Movie Gundello Dammu First Mass Look Poster Out - Sakshi

అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌లో పాల్గొని వీక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్‌ చేసినవారిలో అలీ ఒకరు. ఫిజికల్‌ టాస్కుల్లో గట్టిపోటీనిస్తూ ఇతర కంటెస్టెంట్లకు చెమటలు పట్టించిన అలీ ఒకానొక సమయంలో షో నుంచి ఎలిమినేట్‌ అయినప్పటికీ తిరిగి వైల్డ్‌కార్డ్‌ ద్వారా హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. తన కోపం తన పతనానికి కారణమవుతుందని తెలుసుకున్న అలీ దాన్ని అదుపులో పెట్టుకుంటూ ఫినాలేకు చేరుకున్నాడు. టాప్‌ 5లో చోటు దక్కించుకున్న అలీ ట్రోఫీ గెలవలేకపోయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. 

నిన్న(మే 24న) అలీ రెజా బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు తన కొత్త సినిమాను ప్రకటించాడు. 'గుండెల్లో దమ్మున్న దోస్త్‌ ఖాజా భాయ్‌' అంటూ G.D (G ఫర్‌ గుండె, D ఫర్‌ దమ్ము) సినిమా పోస్టర్‌ను రిలీజ్‌ చేశాడు. ఈడు ఎవని అయ్యకి వినడు, దోస్తులకు తప్ప అని రాసుకొచ్చాడు. అయితే తన ప్రయాణంలో ఏం జరగబోతుందనేది ఖాజా భాయ్‌కు కూడా తెలీదు అని పేర్కొన్నాడు. గుండెల్లో దమ్మున్న దోస్తులు అందరికోసం ఈ ఫస్ట్‌ లుక్‌ అని తెలిపాడు. పోస్టర్‌లో అలీ రకరకాల సంఘర్షణకు లోనవుతున్నట్లు కనిపిస్తోంది. సినిమా చేస్తున్నందుకు కంగ్రాట్స్‌ చెప్తూన్‌ ఫ్యాన్స్‌ అలీ రెజాకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు.

చదవండి: అలీ రెజా కొత్త కారు, ర‌వి ఏదో అంటున్నాడే?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top