Bigg Boss 6 Telugu: బాత్రూంలో ‘హెయిర్స్‌’ లొల్లి.. అతి చేసిన గీతూ!

Bigg Boss 6 Telugu Latest Episode Highlights - Sakshi

బిగ్ బాస్ షో అంటేనే వివాదాలు.. కాంట్ర‌వ‌ర్సీలు.. ఒక‌రినొక‌రు అరుచుకోవ‌డం.అయితే ప్ర‌తీసారి సీజ‌న్ మొద‌లైన త‌ర్వాత క‌నీసం వారం రోజుల త‌ర్వాత ఈ చిచ్చు మొద‌లవుతుంది. కానీ ఆరో సీజన్‌లో మాత్రం రెండో రోజే ర‌చ్చ మొద‌లైపోయింది. గలాట గీతూ, ఇనయ సుల్తానాల మధ్య ‘హెయిర్స్‌’వార్‌ జరిగింది. నీకు తిక్క అంటే నీకు తిక్క అంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. గీతూకి ఓ సలహా ఇచ్చాడు బాలాదిత్య, కీర్తి భట్‌తో సూర్య పులిహోర కలపడం స్టార్‌ చేశాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగిందో నేటి ఎపిసోడ్‌లో చదివేద్దాం.

పక్కా లోకల్ పాటతో నిద్రలేచారు ఇంటి సభ్యులు. అభినయ శ్రీ తన మాస్‌ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఇంతలోనే గలాట గీతూ బాత్రూం గొడవ మొదలుపెట్టేసింది. బాత్రూంలో ఎవరివో హెయిర్స్‌ ఉన్నాయని, తలస్నానం చేసినప్పుడు ఎవరి హెయిర్స్‌ వాళ్లే తీసి పడేయాలి, బిగ్‌బాస్‌ తనకు ఈ టాస్క్‌ ఇచ్చినా చేయనని చెప్పుకొచ్చింది. ఇదే విషయంపై ఇనయ సుల్తానాతో గొడవ జరిగింది. నువ్వు తిక్కదానికి అంటే.. నువ్వు తిక్కదానివి అంటూ ఇద్దరూ తిట్టుకున్నారు. ఈ లొల్లిపై గీతూకు బాలాదిత్య ఓ సలహా ఇచ్చాడు. నువ్వు చెప్పిన విషయం కరెక్టే అయినా... విధానం సరిగా లేదని గీతూతో అన్నాడు. అయితే  ఆ సహాలను గీతూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలోనే ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ఇచ్చాడు. ‘క్లాస్.. మాస్‌.. ట్రాష్’అనే ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్‌ మూడు భాగాలుగా విడిపోవాలి. క్లాస్‌కు  విశేషాధికారాలుంటాయి.

వారు ఏ పనైనా చేసుకోవచ్చు. వీఐపీ బాల్కనీ వాడుకోవచ్చు. కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం ఉంటుంది. నేరుగా నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారు. ఇక ట్రాష్‌ సభ్యులు గార్డెన్‌ ఏరియాలోనే వంట చేసుకోవాలి. కప్టెన్సీ పోటీదారులయ్యే అర్హత ఉండదు. నేరుగా నామినేషన్‌లోకి వెళ్తారు. మాస్‌ సభ్యులు సామాన్యులుగా ఉంటారు. వారికి ఎలాంటి అధికారాలు  ఉండవు. చివరకు మాస్ సభ్యుల్లో ముగ్గురు క్లాస్, ముగ్గురు ట్రాష్ ఉంటారు’అని బిగ్‌బాస్‌ ఇచ్చిన లెటర్‌ని చదివేసింది ఫైమా. ఆ తర్వాత ఇంటిసభ్యులు ఓటింగ్‌కి వెళ్లారు.అందులో బాలాదిత్య, శ్రీహాన్, సూర్యలు క్లాస్.. రేవంత్, గీతూ, ఇనయ సుల్తానలు ట్రాష్‌‌లోకి వచ్చారు. మిగిలిన అందరూ కూడా మాస్ సభ్యులు అని ఓటింగ్ లో తేల్చారు.

ఇక కెప్టెన్సీలో ఎవరికి సపోర్ట్‌ చేయాలో వాసంతి, ఆరోహి, షానిలు చర్చించుకున్నారు. మరోవైపు వాసంతికి నాగార్జున ఇచ్చిన మూడు బ్యాడ్జీలను తనకు నచ్చిన వాళ్లకి పెట్టేసింది. హగ్‌ బ్యాడ్జ్‌ గీతూకి, పంచ్‌ బ్యాడ్జ్‌ షానీకి, కిస్‌ బ్యాడ్జ్‌ మెరినాకి ఇచ్చేసింది. 

ఇక బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో రెండో లెవల్లో భాగంగా ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఓ అవకాశం ఇచ్చాడు. సమయానుసారం మాస్‌ మరియు ట్రాష్‌ సభ్యులకు బిగ్‌బాస్‌ కొన్ని చాలెంజెస్‌ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో  గెలిచిన వారికి  ఓ తరగతి పైకి వెళ్లే అవకాశం ఉటుంది. గెలిచిన సభ్యులు వెళ్లిన తరగతి నుంచి ఒకరు స్వాప్‌ అయి ఒక మెట్టు కిందకు దిగుతారు. క్లాష్‌..మాస్‌..ట్రాష్‌’టాస్క్‌ ముగిసే సమయానికి ఎవరు ఏ తరగతిలో ఉంటే..వారికి ఆ తరగతిలో ఉన్న ప్రయోజనాలు లేదా నష్టాలు వర్తిస్తాయి. ప్రతి చాలెంజ్‌లో క్లాస్‌లొని ముగ్గురు సభ్యులు సంచాలకులుగా వ్యవహరిస్తారు. 

ఇందులో భాగంగా మొదటి చాలెంజ్.. కొబ్బరి బోండాల యుద్దం అంటూ టాస్క్ ఇచ్చాడు. ఈ ఆట ఆడేందుకు ఆది రెడ్డి, ఇనయ ముందుకు వచ్చారు. ఈ గేమ్‌లో ఆదిరెడ్డి గెలిచి  క్లాస్ సభ్యుడిగా మారిపోయాడు. క్లాస్ సభ్యుల్లోంచి శ్రీహాన్ మాస్ సభ్యుడిగా వచ్చాడు.

ఇక కీర్తిభట్‌తో పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు సూర్య. ఆమె వేసుకున్న టీషర్ట్‌ బాగుందని, అలాంటిదే తన వద్ద ఉందని చెప్పగా..అవునా..మరి వేసుకోవాల్సింది అని కీర్తి కౌంటర్‌ ఇచ్చింది. రేపు వేసుకుంటాలే అని సూర్య చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇంకేంటి పిచ్చి అని స్వీట్‌గా పిలవగా... ‘ఏమన్నావ్‌..’ అని కీర్తి షాకైంది.. పిచ్చి అని నేను అంటుంటాను అలా అనడం నాకు ఇష్టమని సూర్య అంటే..పిచ్చి అనేది ఫేవరేట్ వర్డ్ అంటూ కీర్తి తెగ సిగ్గు పడుతుంది. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ ఓడిపోయానని ఇనయ బాధ పడుతుంటే.. అభినయ శ్రీ వచ్చి ఓదార్చింది. 

ట్రాష్‌ సభ్యులకు  ఓ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. మీరు ట్రాషీ కాదని చెప్పండి. గర్వించే విషయాలను, సందేశాలను మిగతా సభ్యులకు వినిపించండి. వాటిని బాటిల్‌పై రాసి స్విమ్మింగ్‌ పూల్‌లో వేయండి’అని బిగ్‌బాస్‌  చెప్పాడు. 

మొదటగా ఇనయ మాట్లాడుతూ..  ‘ముజబుర్ రెహ్మాన్.. మా నాన్న.. నన్ను తారగా గుర్తించాడు.. నాకు ఎక్కువ ఇష్టమైన వ్యక్తి.. తాను ఇండస్ట్రీలోకి వెళ్లాలని అనుకున్నాడు. వెళ్లాడు.. కానీ ఆర్థిక కష్టాలు., ఇంట్లో సమస్యలు.. వల్ల వెనక్కి వచ్చాడు.. మాతోనే ఉండిపోయాడు.. రెండేళ్ల క్రితం చనిపోయాడు.. డాడీ కలను పూర్తి చేసేందుకు నేను ఇండస్ట్రీకి వచ్చాను.. ఇక్కడకు రావడానికి కారణం మా డాడీనే.. పారిపోయి వచ్చాను..నేను యాక్ట్ చేయడం మా మ్మమ్మీకి ఇష్టం లేదు.. ఫుడ్ కూడా లేని స్థితి.. హాస్టల్లో అన్నంలో నీళ్లు పోసుకుని తిన్నాను.. మళ్లీ ఈ రోజు ఇక్కడ కూడా అదే గుర్తొచ్చింది..అలానే తిన్నాను. ఐ లవ్ మై డాడ్. అందరూ పిలవాలని.. ఇనయ రెహ్మాన్ అని పేరు పెట్టుకున్నాను. ఇంత పెద్ద షోలో చెబుతున్నాను.. ఐ లవ్ మై డాడ్’ అంటూ  కన్నీళ్లు పెట్టుకుంది.

ఇది విని కీర్తిభట్‌  వెక్కివెక్కి ఏడ్చింది. తన గతంలో గుర్తుచేసుకొని బాగా ఎమోషనల్‌ అయింది. వీరిని గీతూ భయపడింది. నేను ఇప్పుడు చెప్పలేను బాబోయ్‌ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కచ్చితంగా చెప్పాల్సిందే అనడంతో.. కొంచెం టైం కావాలని కోరింది. దీంతో రేవంత్‌ తన గురించి చెప్పుకొచ్చాడు. ‘నాన్న చనిపోయిన విషయం నాకు ఎవరూ చెప్పలేదు. ఆరో తరగతి వరకు చెప్పలేదు.. బాగా చదువుకుంటే వస్తాడని అన్నారు.. ఆయన లేరనే విషయం తెలియక ముందు అమెరికా వెళ్లాలని.. మా డాడీని చూడాలని అనుకున్నాను.. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే అమ్మానాన్నల ప్రేమ, ప్రజల ప్రేమ’ అని అన్నాను.

ఇక గీతూ మాట్లాడుతూ.. ‘సంతోషం, ఏడుపు, ప్రేమ, కోపం ఏదీ కూడా ఆపుకోలేదు.. ఈ రోజు నన్ను ఇక్క డ అందరూ ట్రాషీ అన్నారు. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను అలానే అనేవాళ్లు.. నేను ఎదుటి వాళ్లను పట్టించుకోలేదు.. నన్ను గౌరవిస్తేనే నేను గౌరవిస్తా.. మా ఊర్లో, బంధువులు అందరూ కూడా ఎవ్వరినీ కూడా నాతో మాట్లాడొద్దని అనేవాళ్లు.. అందరూ నన్ను దూరం పెట్టేశారు.. రివ్యూలు చెప్పినప్పుడు నన్ను జనాలు గుర్తించారు.. మోటివేషన్ వీడియోలు చేసినప్పుడు నాలో విషయం ఉందని గమనించారు.. జనాలు షేర్ చేశారు.. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నాను.. నా ఫాలోవర్లే వల్లే ఇంత దూరం వచ్చింది.. నాలో టాలెంట్ ఉందని, నన్ను స్టార్ అని జనాలు గుర్తించారు. నేను స్టార్ అని తెలిసిన తరువాత చాలా మంది వచ్చారు.. అంతకంటే ముందే నా ఫాలోవర్లు నాకు సపోర్ట్‌గా నిలిచారు.. సిగ్గు లేకుండా ఏడుస్తున్నా. ఏం చెప్పానో నాకు తెలియడం లేదు.. గలీజ్ గా ఉంది.’తనదైన శైలీలో చెప్పుకొచ్చింది గీతూ. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో గీతూ కొంచెం అతి చేసినట్లు అనిపించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

05-09-2022
Sep 05, 2022, 19:49 IST
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షో అంటే పడిచచ్చేవారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు...
05-09-2022
Sep 05, 2022, 13:51 IST
సింగర్‌ రేవంత్‌ ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. బాహుబలి చిత్రంలోని మనోహరీ.....
05-09-2022
Sep 05, 2022, 13:19 IST
బుల్లితెరపై బిగ్‌బాస్‌ షోకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20మంది కంటెస్టెంట్లు, వందరోజులకు పైగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెలుగు బిగ్‌బాస్‌...
04-09-2022
Sep 04, 2022, 21:28 IST
Singer Revanth In Bigg Boss 6 Telugu: సింగర్‌ రేవంత్‌.. బిగ్‌బాస్‌-6 లో 21వ, చివరి కంటెస్టెంట్‌గా రేవంత్‌ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. రావడంతోనే...
04-09-2022
Sep 04, 2022, 21:23 IST
Arohi Rao In Bigg Boss 6 Telugu: వరంగల్‌కు చెందిన అరోహి రావ్‌ అలియాస్‌ అంజలి చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొంది....
04-09-2022
Sep 04, 2022, 21:18 IST
Raja Shekar In Bigg Boss 6 Telugu: గత సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా మోడలింగ్‌ రంగం నుంచి ఒకరు బిగ్‌బాస్‌లోకి...
04-09-2022
Sep 04, 2022, 21:08 IST
Adi Reddy In Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ రివ్యూలతో పాపులర్‌ అయిన ఆదిరెడ్డి  కామన్‌ మ్యాన్‌గా ఈసారి బిగ్‌బాస్‌...
04-09-2022
Sep 04, 2022, 20:56 IST
Faima In Bigg Boss 6 Telugu: జబర్దస్త్‌లో తనదైన కామెడీ టైమింగుతో అలరిస్తుంది లేడీ కమెడియన్‌ ఫైమా. పటాస్‌ షోతో గుర్తింపు...
04-09-2022
Sep 04, 2022, 20:43 IST
Rj Surya  In Bigg Boss 6 Telugu: సుంకర సూర్యనారాయణ అలియాస్‌ కొండబాబు అలియాస్‌ ఆర్జే సూర్య. 991 ఏప్రిల్‌1న...
04-09-2022
Sep 04, 2022, 20:36 IST
 Inaya Sulthana In Bigg Boss 6 Telugu: ఊ అంటావా పాటతో బిగ్‌బాస్‌-6లోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయా సుల్తానా తన డ్యాన్స్‌తో...
04-09-2022
Sep 04, 2022, 20:28 IST
Shaani Salmon In Bigg Boss 6 Telugu: బ్లాక్‌ స్టార్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన నటుడు షానీ. తనకు ఐదుమంది గర్ల్‌ఫ్రెండ్స్‌...
04-09-2022
Sep 04, 2022, 20:19 IST
Vasanthi Krishnan  In Bigg Boss 6 Telugu: మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన వాసంతీ కృష్ణన్‌ తొలుత కన్నడ సినిమాల్లో నటించింది. సిరిసిరి మువ్వలు...
04-09-2022
Sep 04, 2022, 20:14 IST
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బాలాదిత్య. ఆ సినిమాలో పిసినారి తండ్రి రాజేంద్రప్రసాద్‌...
04-09-2022
Sep 04, 2022, 20:01 IST
Marina And Rohit In Bigg Boss6 Telugu: మెరీనా పూర్తిపేరు మెరీనా అబ్రహం.‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో పాపులర్‌ అయిన...
04-09-2022
Sep 04, 2022, 19:51 IST
Abhinaya Sri In Bigg Boss 6 Telugu: 'స్నేహమంటే ఇదేరా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి అభినయశ్రీ. అల్లు అర్జున్‌ హీరోగా...
04-09-2022
Sep 04, 2022, 19:38 IST
Geetu Royal In Bigg Boss 6 Telugu: సోషల్‌ మీడియా ఫాలో అయ్యేవారికి గీతూ రాయల్‌ గురించి తెలిసే ఉంటుంది. తన...
04-09-2022
Sep 04, 2022, 19:25 IST
Arjun Kalyan In Bigg Boss 6 Telugu: 2013లో 'చిన్న సినిమా' అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన అర్జున్‌ పలు...
04-09-2022
Sep 04, 2022, 19:17 IST
Sri Satya In Bigg Boss 6 Telugu: నటి శ్రీసత్య అసలు పేరు మంగళంపల్లి శ్రీసత్య. 2015లో మిస్‌ విజయవాడ టైటిల్‌ గెలిచింది....
04-09-2022
Sep 04, 2022, 19:10 IST
Chalaki Chanti In Bigg Boss 6 Telugu: బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు చలకీ చంటీ....
04-09-2022
Sep 04, 2022, 18:42 IST
Neha Chowdary In Bigg Boss 6 Telugu: యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం...

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top