
Arjun Kalyan In Bigg Boss 6 Telugu: 2013లో 'చిన్న సినిమా' అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన అర్జున్ పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. వరుడు కావలెను, ఉప్మా తినేసింది, మిస్సమ్మ వంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు పొందిన అర్జున్ ప్లేబ్యాక్, పెళ్లి కూతురి పార్టీ వంటి సినిమాల్లో నటించాడు. ఆంధ్రప్రదేశ్‌లోకి కొవ్వూరుకి చెందిన అర్జున్ యూఎస్‌లోని కెంటకీ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశాడు.
ఇక బిగ్‌బాస్-6లో ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌కు ఈ షో ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి. హౌస్‌లోకి వెళ్లేముందు చాక్లెట్ చేతులో పెట్టిన నాగార్జున.. అది సగం కొరికి ఎవరైనా నచ్చిన కంటెస్టెంట్‌కి ఇవ్వమని నాగార్జన చెప్పారు. మరి హౌస్‌లో అర్జున్‌కి నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఆ చాక్లెట్ ఎవరికి ఇచ్చాడు అన్నది చూడాలి.