బిగ్‌బాస్‌-5లో షణ్ముఖ్‌ లేనట్లేనా?..పోస్ట్‌ వైరల్‌ | Bigg Boss 5 Telugu: Shanmukh Jaswanth Reaction On Negative Rumors | Sakshi
Sakshi News home page

Shanmukh : తిట్లు నాకేం కొత్త కాదు.. కానీ వాటిని నమ్మకండి

Aug 10 2021 7:41 PM | Updated on Sep 1 2021 8:13 PM

Bigg Boss 5 Telugu: Shanmukh Jaswanth Reaction On Negative Rumors - Sakshi

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌-5 తెలుగు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ లోగోని కూడా విడుదల చేశారు నిర్వాహకులు.  సెప్టెంబర్‌5 నుంచి ఈ షో ప్రసారం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రతి సీజన్‌ మాదిరిగానే ఈసారి కూడా కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఆ లిస్ట్‌లో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, జబర్దస్త్‌ ప్రియాంక, ఆనీ మాస్టర్‌, కార్తీక దీపం ఫేమ్‌ ఉమా దేవి, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్‌ జస్వంత్‌, పూనం భాజ్వా, యాంకర్‌ శివ, లోబో, యాంకర్‌ ప్రత్యూష ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అందరి కంటే యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌కు అత్యధిక రెమ్యునరేషన్‌ ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

‘ది సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్‌తో యూత్‌లో మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న షణ్ముఖ్‌ జస్వంత్‌కు బిగ్‌బాస్‌ టీం  కోటి రూపాయల రెమ్యునరేషన్‌ కూడా ఆఫర్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా షణ్ముఖ్‌కి అంత రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి బిగ్‌బాస్‌ టీం సిద్ధంగా లేనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అడిగినంత ఇవ్వకపోతే హౌస్‌లోకి రానంటూ షన్నూ బెట్టు చేసినట్లు సోషల్‌ మీడియాలో రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన షణ్ముఖ్‌.. నెగిటివ్‌ కామెంట్లు నాకు కొత్త కాదు. రాసే వాళ్లను రాయనివ్వండి. నేను చెప్పేవరకు వేటినీ నమ్మకండి అంటూ షణ్ముఖ్‌ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. దీంతో అతను బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement