Maanas: ఫస్ట్‌ లవ్‌ స్టోరీ చెప్పిన మానస్‌, ఆ కారణంతో బ్రేకప్‌!

Bigg Boss 5 Telugu: Maanas Revealed His Love Story - Sakshi

Bigg Boss 5 Telugu, Maanas First Love Story: బయటకు ఎంతో కూల్‌గా కనిపించే మానస్‌ ఒకప్పుడు ఇలా అస్సలు లేడట. అల్లరి చేస్తూ చిన్నపాటి రౌడీలా ఉండేవాడట! మరి మానస్‌ ఈ రేంజ్‌లో మారిపోవడానికి కారణం తన ఫస్ట్‌ లవ్‌ అంటున్నాడు. తను తొలిసారిగా మనసు పారేసుకున్న అమ్మాయి గురించి చెప్తూ.. 'మాది ఎనిమిదన్నరేళ్ల రిలేషన్‌షిప్‌. ఇద్దరం ఒకే స్కూల్‌. ఇప్పుడున్న మానస్‌ ఒకప్పుడు ఇలా లేడు. అందరినీ ఏడిపిస్తూ చిన్నపాటి రౌడీలా ఉండేవాడు. అక్టోబర్‌ 30న ఆమె బర్త్‌డే. తను రెడ్‌ చుడీదార్‌ వేసుకుని వచ్చింది. చాలా చాలా అందంగా ఉంది. ఆరోజు నేను తలకు నూనె పెట్టుకుని గ్రీన్‌ టీషర్ట్‌ వేసుకుని వెళ్లాను.

ఆ అవతారంలో ఆమె ముందుకు వెళ్లాలంటే ఏదోలా అనిపించింది. తనకు నచ్చుతానా? లేదా? అని భయపడిపోయా! అయితే ఆమెకు టీషర్ట్స్‌ అంటే ఇష్టమని ఆరోజే తెలిసింది. నేను ఆ రోజు టీషర్ట్‌ వేసుకోవడం తనకు నచ్చింది. అలా మేము మాట్లాడుకున్నాం. ఒకానొకరోజు ప్రపోజ్‌ చేశా.. ఆమె మెలికలు తిరిగిపోతూ డ్యాన్స్‌ చేసింది. తనకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. అలా నాకూ డ్యాన్స్‌ అంటే ఇష్టం ఏర్పడింది. కానీ తను ఆదిత్య అనే అబ్బాయితో డ్యాన్స్‌ చేసేది. నాకు నచ్చేది కాదు, కానీ చెప్పలేకపోయాను. అది మా ఇద్దరి మధ్య కొంచెం దూరాన్ని పెంచింది. ఆదిత్యకు ఆల్‌రెడీ గర్ల్‌ఫ్రెండ్‌ ఉందని ఆమె చెప్పేది. కానీ అతడు నీవైపు చూసే చూపు సరిగా లేదని చెప్పాను. ఆమె నమ్మలేదు. ఆ తర్వాత నన్ను ప్రేమించడం కూడా మానేసింది. ఆమె నా ఫస్ట్‌ లవ్‌, లవ్‌ యూ బాబీ. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి' అంటూ ఎమోషనల్‌ అయ్యాడు మానస్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top