బిగ్‌బాస్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వీరే‌!

Bigg Boss 4 Telugu: Two Wild Card Contestants Are In Que - Sakshi

సెప్టెంబ‌ర్ ఆరున‌ గ్రాండ్‌గా ప్రారంభ‌మైన బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో ముందుగా ఊహించిన ఓ కంటెస్టెంటు మాత్రం మిస్స‌య్యాడు. అత‌డే జ‌బ‌ర్ద‌స్థ్ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌. సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టినుంచో అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌ర‌వుతున్నాడంటూ బోలెడ‌న్ని వార్త‌లు వీర‌విహారం చేశాయి. కానీ అనూహ్యంగా చివ‌రి నిమిషంలో అత‌ను ఎంట్రీ ఇవ్వ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఖంగు తిన్నారు. అలా అని అవినాష్ షో నుంచి త‌ప్పుకున్నాడ‌ని చెప్ప‌లేం. అత‌డు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌గిన‌ స‌మ‌యం చూసి బిగ్‌బాస్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాణాన్ని వ‌ద‌ల‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. (చూడాలి: దేత్త‌డి హారిక‌: బెడిసి కొట్టిన ప‌బ్లిసిటీ!)

సాయికుమార్ బిగ్‌బాస్ హౌస్‌లోకి!
అవినాష్‌తోపాటు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం ఉన్న మ‌రో ముఖం కూడా త్వ‌ర‌లోనే బిగ్‌బాస్ హౌస్‌లో చూసే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. 'ఈ రోజుల్లో' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ కూడా హౌస్‌లో భాగం కానున్నాడు. అస‌లే హౌస్‌లో సెల‌బ్రిటీలు పెద్ద‌గా లేరు, ఉన్న‌వాళ్లు కూడా యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో షో ర‌క్తిక‌ట్ట‌డం లేదు. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారానైనా బిగ్‌బాస్‌కు బిగ్ బ్రేక్ ఇద్దామ‌ని ప్లాన్ చేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించేందుకు ఓ అమ్మాయిని కూడా సెలక్ట్ చేసి పెట్టారు. 'జంప్ జిలానీ' హీరోయిన్ ‌స్వాతి దీక్షిత్‌ను ఓ ఆప్ష‌న్‌గా పెట్టుకున్నారు. ఈమె చిత్రాంగ‌ధ‌, లేడీస్ అండ్ జెంటిల్మెన్ చిత్రాల్లోనూ న‌టించింది (చూడాలి: రూ.50 ల‌క్ష‌లు వ‌స్తే.. : గ‌ంగ‌వ్వ‌)

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారా?
వైల్డ్ కార్డ్ ఎంట్రీల వ‌ల్ల బిగ్‌బాస్ షో ఎంత ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారిందో గ‌త సీజ‌న్ల‌లోనే చూశాం. మూడో సీజ‌న్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన త‌మ‌న్నా కంటెస్టెంట్ల‌తో ఆడుకుని వారిని ఏడిపించిన విష‌యం తెలిసిందే. ఆమె అరాచ‌కాల‌ను చూడ‌లేక ప్రేక్ష‌కులు రెండు మూడు వారాల్లోనే త‌మ‌న్నాను బ‌య‌ట‌కు పంపించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా శిల్పా శెట్టిని కూడా లోనికి పంపించిన‌ప్ప‌టికీ అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు ప్రేక్ష‌కులు కూడా ఆమెకు క‌నెక్ట్ అవ‌లేదు. దీంతో ఆమె కూడా వ‌చ్చిన‌దారినే తిరుగుముఖం ప‌ట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా టైటిల్ గెలుచుకున్న దాఖ‌లాలు లేవు. మ‌రి ఈసారి వ‌చ్చే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లైనా టైటిల్ కోసం పోరాడుతారా? వ‌చ్చిన‌దారినే వెళ్లిపోతారా? అస‌లు ప‌్రేక్ష‌కులు వీరిని ఏమేర‌కు ఆద‌రిస్తారు అనేది చూడాల్సిందే. (చూడాలి: బిగ్‌బాస్ అనైతిక షో: నారాయణ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top