బిగ్‌బాస్‌: బ్ర‌ద‌ర్స్ అంటూ షాకిచ్చిన హారిక‌

Bigg Boss 4 Telugu: Harika Out Of Race For Trophy - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ట్రోఫీ గెలుచుకునేందుకు అరియానా, సోహైల్‌, హారిక‌, అఖిల్‌, అభిజిత్ హోరాహోరీగా పోరాడారు. కానీ అంద‌రిలో హారిక‌కే త‌క్కువ ఓట్లు ప‌డ‌టంతో ఆమె టైటిల్ రేసు నుంచి నిష్క్ర‌మించ‌క త‌ప్ప‌లేదు. కానీ వెళ్లిపోయేముందు దేత్త‌డి హౌస్‌మేట్స్‌ను బ్ర‌ద‌ర్ అని పిలుస్తూ షాకిచ్చింది. కొత్త‌గా ఈ పిలుపేంటని అఖిల్‌, సోహైల్ ఖంగు తిన్నారు. త‌మ‌ను అలా పిల‌వొద్ద‌ని వేడుకున్నారు. స్టేజీ మీద‌కు వ‌చ్చిన త‌ర్వాత‌ హారిక‌ మాట్లాడుతూ.. మా అమ్మ న‌న్ను వ‌దిలేసి ఇన్ని రోజులు ఉండ‌టం మొద‌టిసారి అని చెప్పింది. అమ్మ‌, అన్న‌య్య‌ గ‌ర్వ‌ప‌డేలా చేశాన‌నుకుంటున్నాన‌ని తెలిపింది. ఇక ట్రోఫీ ఎవ‌రు గెలిచినా హ్యాపీనే అని చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి:బిగ్‌బాస్‌: నెర‌వేరుతున్న గంగ‌వ్వ క‌ల‌)

కాగా హారిక జ‌ర్నీ చూసుకుంటే మొద‌ట్లో ఆమె అభిజిత్‌, లాస్య‌, నోయ‌ల్‌తో మాత్ర‌మే ఉండేది. నోయ‌ల్‌ను తండ్రిలా ఫీల‌య్యేది. కానీ కేవ‌లం ఈ గ్రూపుతో మాత్ర‌మే ఉంటోంద‌ని, అంద‌రి‌తో క‌ల‌వ‌డం లేదన్న కార‌ణంతో ఆమెను ఇంటిస‌భ్యులు ప‌దేప‌దే నామినేట్ చేసేవారు. అయితే గేమ్ చివ‌రికి వ‌చ్చేస‌రికి మాత్రం ఆమె అంద‌రితోనూ క‌లిసిపోయింది. ఈ క్ర‌మంలో త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అభి కొన్నిసార్లు హ‌ర్ట్ అయ్యాడు కూడా! కాగా హౌస్‌లో ఎన్నో టాస్కుల్లో ఒంట‌రిగా పోరాడిన ఆమె ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచి రికార్డు సృష్టించింది. చివ‌రికి 13వ వారంలో కెప్టెన్‌గా అవ‌త‌రించింది. అంతేకాకుండా ఈ సీజ‌న్‌లోనే బెస్ట్ కెప్టెన్‌గా అవ‌త‌రించింది. టాస్కుల‌తో పాటు డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో కూడా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్న హారిక‌.. అవినాష్‌ను ఏడిపించాల‌న్న సీక్రెట్ టాస్క్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. మొత్తానికి హారిక‌ చోటా ప్యాకెట్ బ‌డా ధ‌మాకా అన్న వాక్యానికి ప్ర‌త్య‌క్ష‌ నిద‌ర్శ‌నంగా మారింది. (చ‌ద‌వండి:బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అప్‌డేట్స్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top