ఫైన‌లిస్టుల‌తో ఆడుకుంటున్న మాజీ కంటెస్టెంట్లు!

Bigg Boss 4 Telugu: Ex Contestants Interaction With Housemates - Sakshi

మ‌రో ఐదు రోజుల్లో బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ విన్న‌ర్ ఎవర‌నేది తేలిపోనుంది. గెలుపు కోసం త‌పిస్తూ ఇప్ప‌టిదాకా క‌ష్ట‌ప‌డ్డ కంటెస్టెంట్లకు కాస్త స‌ర‌దాను పంచేందుకు కొత్త అతిథులు వ‌చ్చారు. మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హ‌రితేజ‌, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రెజా ప్ర‌త్యేక గ‌దిలో నుంచి ఫైన‌లిస్టులకు హాయ్ చెప్తూ వారిని స‌ర్‌ప్రైజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా సీనియర్లు జూనియ‌ర్ల‌ను ప్ర‌శ్న‌ల‌తో ఆడుకున్నారు. వారితో స్పెష‌ల్ టాస్కులు చేయిస్తూ డ్యాన్సులు కూడా చేయించిన‌ట్లు క‌నిపిస్తోంది. వీరిని ఆక‌ట్టుకునేందుకు అభిజిత్ అంద‌రూ ఎంత బాగున్నారో అంటూ పొగిడేయ‌గా.. హ‌రితేజ అందుకుని మ‌మ్మ‌ల్ని కూడా వ‌ద‌ల‌వా? అని పంచ్ వేసింది.

ఇక శ్రీముఖి.. మోనాల్ వెళ్లిపోయాక సైలెంట్ అయ్యావేంటి అని అఖిల్ బాధ‌ను పంచుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఇంత‌లో సోహైల్ అఖిల్ గాలి తీసేస్తూ.. అత‌డు ఇక్క‌డున్న ఇద్ద‌ర‌మ్మాయిల‌కు సోపేస్తున్నాడ‌ని పులిహోర వేషాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. అయితే మోనాల్ వెళ్లిపోయాక ఆమెను త‌లుచుకుని బాధ‌ప‌డ్డ అఖిల్‌కు నిన్న‌టి ముసుగు టాస్క్‌లో ఆమె లేని లోటు స్ప‌ష్టంగా తెలుసొచ్చింది. అభి- హారిక‌, సోహైల్‌-అరియానా క‌లిసి డ్యాన్సు చేస్తుంటే అఖిల్ మాత్రం ఒంట‌రిగానే స్టెప్పులేశాడు. (విజ‌యానికి దూర‌మ‌వుతున్న సోహైల్‌!)

కాగా గ‌త సీజ‌న్ల‌లో మ‌న‌ల్ని లౌడ్ స్పీక‌ర్ అన్నారు కానీ అక్క‌డుంది అస‌లైన లౌడ్ స్పీక‌ర్ అంటూ హ‌రితేజ‌, శ్రీముఖి.. అరియానా వైపు వేలు చూపిస్తూ ఆమెను ఇమిటేట్ చేసి న‌వ్వించారు. అనంత‌రం నిన్ను చేసుకునే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీ ఉండాల‌ని శ్రీముఖి సోహైల్‌ను ప్ర‌శ్నించింది. దీనికి అత‌డు బ‌దులిస్తూ త‌నకు కోపం వ‌చ్చిన‌ప్పుడు కూల్ చేసే సామ‌ర్థ్యం ఉండాల‌ని చెప్పాడు. ఇది విన్న‌ శ్రీముఖి అది ఎవ‌రి వ‌ల్లా చేత‌కాదు అంటూ దండం పెట్టేసింది. మ‌రి వీరి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను చూడాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (హారిక‌, అరియానాకు గెలిచే అర్హ‌త లేదు!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top