SS Rajamouli, Mahesh Babu Big-Budget Film Likely To Begin On September,2023 - Sakshi
Sakshi News home page

సెప్టెంబరులో స్టార్ట్‌? 

Apr 6 2023 3:31 AM | Updated on Apr 6 2023 8:23 AM

A big budget film directed by Rajamouli with Mahesh Babu as the hero - Sakshi

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచరస్‌ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. షూటింగ్‌ను సెప్టెంబరులో ఆరంభించాలని రాజమౌళి అనుకుంటున్నారట.

ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ సెప్టెంబరుకల్లా దాదాపు పూర్తవుతుందట. ఆ తర్వాత రాజమౌళి సినిమా చిత్రీకరణలో పాల్గొనేలా మహేశ్‌బాబు ప్లాన్‌ చేసుకుంటున్నారట. ఇక త్రివిక్రమ్‌తో మహేశ్‌బాబు చేస్తున్న సినిమా వచ్చే జనవరి 13న విడుదల కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement