
విభిన్నమైన మంచి చిత్రాల్లో నటిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివ కందుకూరి. ఈయన నటింస్తున్న తాజా చిత్రం "భూతద్ధం భాస్కర్ నారాయణ". రాశిసింగ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. డ్రీమ్స్ క్రియేషన్స్,విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇదివరకే రిలీజైన పోస్టర్ సినిమాలపై మంచి అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్..ఈ సినిమాలో శివ కందుకూరి డిటెక్టీవ్ గా కనిపించనున్నాడు. మంచి విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. మార్చి 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.