Bengali Director Tarun Majumdar: పద్మశ్రీ గ్రహిత, ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

Bengali Director Tarun Majumdar Passed Away At 92: సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ బెంగాలీ దర్శకుడు తరుణ్ మజుందార్ కన్నుమూశారు. మధ్యతరగతి కుటుంబాల జీవితం, వారు ఎదుర్కొనే ఒడిదొడుకుల ఆధారంగా హృద్యమైన కథల చుట్టూ తిరిగే ఐకానిక్ చిత్రాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఇలా భారతీయ చలన చిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడిగా మారారు తరుణ్ మజుందార్. 92 ఏళ్ల తరుణ్ గత కొంతకాలంగా వయో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇందు కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం (జులై 4) తుది శ్వాస విడిచారు.
బ్రిటీష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలో 1931, జనవరి 8న తరుణ్ మజుందార్ జన్మించారు. 1959లోని 'చోవా పావా' సినిమాతో డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు 'యాత్రిక్' పేరుతో సచిన్ ముఖర్జీ, దిలీప్ ముఖర్జీలతోపాటు తరుణ్ మజుందార్ దర్శకత్వం వహించారు. 1960, 70, 80 దశకాల్లో మజుందార్ తెరకెక్కించిన శ్రీమాన్ పృథ్వీరాజ్, కుహెలి, బాలికా వధు, దాదర్ కీర్తి లాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 1990లో పద్మశ్రీ పురస్కారం వరించగా పలు జాతీయ అవార్డులను సైతం దక్కించుకున్నారు తరుణ్ మజుందార్.
చదవండి: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి
హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత..
మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం
మరిన్ని వార్తలు