ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Badgirl Movie OTT Telugu Streaming Details | Sakshi
Sakshi News home page

Badgirl OTT: ఓటీటీలోకి స్టార్ డైరెక్టర్స్ నిర్మించిన కాంట్రవర్సీ మూవీ

Oct 27 2025 6:29 PM | Updated on Oct 27 2025 7:37 PM

Badgirl Movie OTT Telugu Streaming Details

కొన్నాళ్ల క్రితం తమిళంలో ఓ సినిమా తీశారు. టీజర్ రిలీజైన దగ్గర నుంచి టాక్ ఆఫ్ ద టౌన్‌గా ఈ మూవీ నిలిచింది. బ్రహ్మణులని కించపరిచే సీన్స్ ఉ‍న్నాయని, యువతని పెడదోవ పట్టించేలా ఉందని చెప్పి రచ్చ రచ్చ చేశారు. సెన్సార్‪‌లోనూ ఇబ్బందులు తప్పలేదు. తర్వాత ఎలాగోలా థియేటర్లలోకి వచ్చిన ఈమూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుండటం విశేషం. ఇంతకీ దీని సంగతేంటి?

(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి 'చిరంజీవ'.. ట్రైలర్ రిలీజ్)

ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ సమర్పణలో వచ్చిన బోల్డ్ మూవీ 'బ్యాడ్ గర్ల్'. అంజలి శివరామన్ లీడ్ రోల్ చేయగా.. వర్ష భరత్ దర్శకురాలు. సమాజంలో అమ్మాయి స్వతంత్రంగా ఉంటే.. కొందరు వ్యక్తులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆ అమ్మాయిని 'బ్యాడ్ గర్ల్'గా ఎలా ముద్ర వేస్తారు అనే పాయింట్‌తో తీసిన సినిమా ఇది. సెప్టెంబరు 5న థియేటర్లలో తమిళ వెర్షన్ రిలీజ్ కాగా ఇప్పుడు నవంబర్ 4 నుంచి హాట్‌స్టార్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

'బ్యాడ్ గర్ల్' విషయానికొస్తే.. టీనేజీలోకి వచ్చిన మిడిల్ క్లాస్ అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). అందరూ ఆడపిల్లల్లానే తనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండాలని అనుకుంటుంది. అలా స్కూల్ చదువుతున్నప్పుడు నలన్, కాలేజీలో ఉన్నప్పుడు అర్జున్, ఉద్యోగం చేస్తూ ఇర్ఫాన్‌ని ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాలతో వీళ్లతో బ్రేకప్ కూడా అయిపోతుంది. కానీ ఒకానొక సందర్భంలో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితికి వెళ్తుంది. దాన్నుంచి ఎలా బయటపడింది? రమ్యని బ్యాడ్ గర్ల్ అని సమాజం ఎందుకు ముద్ర వేసింది అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement