Asvins Movie OTT Release Date Telugu - Sakshi
Sakshi News home page

Asvins Movie: 'అశ్విన్స్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఆ రోజే నుంచే

Jul 17 2023 4:44 PM | Updated on Jul 17 2023 4:50 PM

Asvins Movie OTT Release Date Telugu - Sakshi

Asvins OTT Release Date: ఓటీటీల్లో ఈ మధ్య సరైన హారర్ సినిమాలు రావడం లేదు! కొన్ని వస్తున్నా అవి ప్రేక్షకుల్ని  ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేయడానికా అన్నట్లు ఓ క్రేజీ హారర్ మూవీ ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైపోయింది. తాజాగా దీని విడుదల తేదీని ప్రకటించారు. ఈ క్రమంలో హారర్ మూవీ లవర్స్ ఎప్పుడు చూడాలా అనేది ప్లాన్ చేసుకుంటున్నారు.

సాధారణంగా హారర్ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి డిమాండ్ ఉంటుంది. కరెక్ట్‌గా తీయాలే గానీ భయపెడుతూనే, కోట్లకు కోట్లు కలెక్షన్స్ సాధిస్తాయి. అలా గత నెల 23న థియేటర్లలోకి వచ్చిన చిత్రం 'అశ్విన్స్'. పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం వల్లో ఏమో తెలియదు గానీ స్టోరీ, సౌండ్ డిజైనింగ్ బాగున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆడలేదు. పెద్దగా వసూళ్లు కూడా రాలేదు. ఇప్పుడు ఈ సినిమానే జూలై 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. 

(ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!)

'అశ్విన్స్' కథేంటి?
అర్జున్(వసంత్ రవి)తో పాటు అతడి నలుగురు ఫ్రెండ్స్ యూట్యూబర్స్. తమ ఛానెల్ కోసం డార్క్ టూరిజం మీద ఓ వీడియో తీయాలలని లండన్ లోని ఓ ఐలాండ్ లో ఉన్న బిల్డింగ్ కి వెళ్తారు. అక్కడ ప్రముఖ ఆర్కియాలిజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ తిరుగుతుందని, ఆ ఇంట్లో అడుగుపెట్టిన 15 మందిని ఆమె చంపేసిందనే ప్రచారం జరుగుతూ ఉంటుంది.  ఇది తెలిసిన‍ప్పటికీ అర్జున్ అతడి ఫ్రెండ్స్ ఇంట్లో అడుగుపెడతారు.

ఆ బిల్డింగ్ లో సంచరించే ఆత్మలు, వాటి అరుపులని తమ కెమెరాలు, వాయిస్ రికార్డ్ పరికరాలతో క్యాప్చర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆ ఐదుగురి జీవితాల్లో ఒక్క రాత్రిలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అసలు ఆర్తి రాజగోపాల్ ఎలా చనిపోయింది? చివరకు అర్జున్ టీమ్ బతికారా లేదా అనేది తెలియాలంటే మీరు 'అశ్విన్స్' సినిమా చూడాలి. మంచి సౌండ్ బాక్స్ సెటప్ మీ దగ్గరుంటే మాత్రం ఈ మూవీ మిమ్మల్ని కచ్చితంగా థ్రిల్ చేస్తుంది. 

(ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement