నా లక్కీ సిటీ హైదరాబాద్‌ | Sakshi
Sakshi News home page

నా లక్కీ సిటీ హైదరాబాద్‌

Published Sun, May 26 2024 7:11 AM

Armaan Malik at Biggest Concert in Hyderabad

బాలీవుడ్‌ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ 

హఫీజ్‌పేట్‌: ‘హైదరాబాద్‌ నా లక్కీ సిటీ. అలాగే ఇది మా అమ్మమ్మ ఊరు కూడా’ అని బాలీవుడ్‌ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ అన్నారు. శనివారం షరటాన్‌ హోటల్‌లో నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘మా అమ్మ తెలుగమ్మాయి కావడంతో హైదరాబాద్‌ నగరంతో ప్రత్యేక అనుబంధముంది.

 కోవిడ్‌ తర్వాత నగరంలో జరిగిన నా మొదటి లైవ్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ ఎప్పటికీ మర్చిపోలేను’ అని గుర్తు చేసుకున్నారు. తన విభావరిని హైదరాబాద్‌ సంగీత ప్రియులు, యువత ఎంతగానో ఆదరించారన్నారు. ‘అల వైకుంఠపురం’ సినిమాలో పాడిన ‘బుట్ట బొమ్మ’ పాట తనకు లైఫ్‌నిచి్చందన్నారు. తెలుగులో తనకు మంచి గుర్తింపు లభించిందన్నారు. త్వరలోనే మరిన్ని టాలీవుడ్‌ పాటలతో తెలుగు శ్రోతలను అలరించనున్నట్లు ఆయన తెలిపారు. అల్లు అర్జున్‌ తన ఫేవరెట్‌ హీరో అని చెప్పారు.    

 

Advertisement
 
Advertisement
 
Advertisement