A.R Rahman Sings and Performs Dance in Maamannan - Sakshi
Sakshi News home page

AR Rahman: చాలా గ్యాప్‌ తర్వాత సినిమాలో పాట పాడిన రెహమాన్‌, డ్యాన్స్‌ కూడా..

Jun 29 2023 4:57 PM | Updated on Jun 29 2023 5:32 PM

AR Rahman Sings a Song and Do Dance in Maamannan - Sakshi

మామన్నన్‌ చిత్రంలో తనను ఒక పాటలో మెరిసేలా చేశారని పేర్కొన్నారు. అయితే తనతో డాన్స్‌ చేయించిన ఘనత డ్యాన్స్‌ మాస్టర్‌ శాండీకే దక్కుతుందని అన్నారు. ఈ పాటను ఉదయనిధి స్టాలిన్‌కు చూపించ

ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతానికి సినీ ప్రేక్షకులు మైమరచిపోతుంటారు. అలాంటిది ఆయన వెండితెరపై ఆడి పాడారంటే ఇంకెంతగా విస్మయంతో చూస్తారో ఆలోచించండి. ఏ ఆర్‌ రెహమాన్‌ ఏంటి? డాన్స్‌ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఆయన డాన్స్‌ చేశారన్నది మాత్రం కచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఈ అరుదైన దృశ్యాన్ని మామన్నన్‌ చిత్రంలో చూడబోతున్నారు.

ఉదయ నిధి స్టాలిన్, కీర్తిసురేష్‌ జంటగా నటించిన చిత్రం మామన్నన్‌. రెడ్‌జెయింట్‌ మూవీస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మారిసెల్వరాజ్‌ దర్శకుడు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్‌ 29న విడుదలైంది. వడివేలు ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాదు చాలా గ్యాప్‌ తరువాత ఆయన ఈ చిత్రంలో ఒక పాట పాడడం విశేషం.

రెహమాన్‌ స్పందిస్తూ తాను చిన్నతనం నుంచి కీబోర్డుతో గడిపానని ఆ తరువాత ఎన్నో స్టేజీలపై పాటలు పాడానని, ఇక ఇలాగే తన జీవితం గడచిపోతుంది అనుకుంటున్న సమయంలో మారిసెల్వరాజ్‌ మామన్నన్‌ చిత్రంలో తనను ఒక పాటలో మెరిసేలా చేశారని పేర్కొన్నారు. అయితే తనతో డాన్స్‌ చేయించిన ఘనత డ్యాన్స్‌ మాస్టర్‌ శాండీకే దక్కుతుందని అన్నారు. ఈ పాటను ఉదయనిధి స్టాలిన్‌కు చూపించగా ఆయన ఆశ్చర్యపోయారని దర్శకుడు మారిసెల్వరాజ్‌ పేర్కొన్నారు.

చదవండి: అతడిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement