Anushka Sharma Attempts To Lift Husband Virat Kohli In New Video, Watch Her Happy Reaction On Pulling It Off - Sakshi
Sakshi News home page

కోహ్లిని ఎత్తిపడేసిన అనుష్క.. వీడియో వైరల్‌!

Apr 7 2021 12:48 PM | Updated on Apr 7 2021 3:02 PM

Anushka Sharma Attempts To Lift Virat Kohli Off His Feet Watch Video - Sakshi

‘‘హే నిజంగానే నువ్వు నన్ను ఎత్తుకున్నావా? మళ్లీ చేసి చూపించు’’

న్యూఢిల్లీ: విరుష్క దంపతులు కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేయడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటారు. కెరీర్‌పై దృష్టి సారిస్తూనే, వ్యక్తిగత జీవితానికి కూడా తగినంత ప్రాధాన్యం ఇస్తారన్న సంగతి తెలిసిందే. టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా అనుష్క శర్మ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన విశేషాలు షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో అభిమానులకు చేరువగా ఉంటారు. ఈ క్రమంలో అనుష్క తాజాగా ఇన్‌స్టాలో పంచుకున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో భర్త కోహ్లిని అనుష్క ఎత్తుకున్నారు.

ఈ సందర్భంగా.. కోహ్లి భార్యను ఆటపట్టించాడు. ‘‘హే నిజంగానే నువ్వు నన్ను ఎత్తుకున్నావా? మళ్లీ చేసి చూపించు’’ అని భర్త అనడంతో.. ఇందుకు స్పందనగా.. అతడిని మరోసారి ఎత్తిపడేశారు అనుష్క. అంతేగాక.. ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయకూడదు అంటూ తానే సొంతంగా పని పూర్తి చేశారు. ఈ వీడియోను వీక్షించిన అభిమానులు.. ‘‘సూపర్‌ అనుష్క.. మీ జంట ఎల్లప్పుడూ కలిసి ఉంటూ, మాకు ఇలాగే వినోదం పంచుతూ ఉండాలి’’ అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా విరుష్క జంట ఈ ఏడాది జనవరి 11న ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పాపకు వామికగా నామకరణం చేశారు. ఇక ఆర్సీబీ కెప్టెన్‌ అయిన, కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌-2021 టోర్నీతో బిజీగా ఉండగా, అనుష్క సినిమాలపై దృష్టి సారించారు. ఇక ఈ వీడియోను షూటింగ్‌ సెట్‌లోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement