బిగ్‌బాస్ ఎంట్రీపై స్పందించిన హీరోయిన్‌

Amritha Aiyer Opens Up On Her Bigg Boss Tamil 4 Entry - Sakshi

తెలుగులో ప్రారంభ‌మైన బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అటు త‌మిళ‌, హిందీలో మాత్రం ఈ షో ఇంకా ప్రారంభం అవ‌నేలేదు. దీంతో అక్క‌డి బిగ్‌బాస్ ప్రేమికులు ప్రోమోల‌తోనే స‌రిపెట్టుకుంటున్నారు. ఇదిలా వుంటే త‌మిళ బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో 'బిగిల్' హీరోయిన్ అమృతా అయ్య‌ర్ పాల్గొంటున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో‌ వార్త‌లు తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీంతో ఓ అభిమాని ఈ డౌటానుమానాన్ని అమృత ద‌గ్గ‌ర ప్ర‌స్తావించాడు. మీరు నిజం‌గానే బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెడుతున్నారా? అని ప్ర‌శ్నించాడు. అందుకు స‌ద‌రు హీరోయిన్ ఏం స‌మాధానం చెప్పాలో తెలీక ఇర‌కాటంలో ప‌డ్డారు. (చ‌ద‌వండి: తీవ్ర అనారోగ్యం.. సర్జరీకి సిద్ధమైన నటి)

ఓ క్ష‌ణమాగి.. "తెలీదు... దీన్ని స‌స్పెన్స్‌గానే ఉంచుదాం" అని చెప్పుకొచ్చారు. ఈ స‌మాధానంతో ఆమె బిగ్‌బాస్ ఎంట్రీ ఖాయ‌మ‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా అమృతా విజ‌య్‌ బిగిల్ సినిమాలో ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా క‌నిపించారు. ప్ర‌దీప్ హీరోగా న‌టిస్తున్న‌ "30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?" సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా విడుద‌ల అవ‌క‌ముందే హీరో రామ్‌ "రెడ్" చిత్రంలోనూ న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఇంకా రిలీజ్ కాక‌పోయిన‌ప్ప‌టికీ "30 రోజుల్లో ఎలా?" సినిమా నుంచి విడుద‌లైన‌ "నీలి నీలి ఆకాశం" పాట‌తో ఆమెకు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఏర్ప‌డింది. (చ‌ద‌వండి: ప్రేయ‌సిని పెళ్లాడిన బిగ్‌బాస్ విన్న‌ర్‌!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top