Ammu Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Ammu Movie In OTT: అమ్ము ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Oct 6 2022 6:30 PM | Updated on Oct 6 2022 6:47 PM

Ammu Movie OTT Release Date Out Now - Sakshi

ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించిన చిత్రం అమ్ము. నవీన్‌ చంద్ర, సింహా ముఖ్య పాత్రల్లో నటించారు. చారుకేశ్‌ శేఖర్‌ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కల్యాణ్‌ సుబ్రహ్మణ్యం, కార్తికేయ సంతానం నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. అమెజాన్‌ ప్రైమ్‌లో అక్టోబర్‌ 19 నుంచి ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ అమ్ము టీజర్‌ను రిలీజ్‌ చేసింది. 'నా పేరు అమ్ము. మా ఇంట్లో అడిగితే అమ్ము అంటేనే అల్లరి పిల్ల అని చెప్తారు' అంటూ హీరోయిన్‌ పరిచయంతో వీడియో మొదలవుతుంది. మరి ఎంతో గారాబంగా పెరిగిన అమ్ము పెళ్లి తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అసలు అమ్ముకేం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

చదవండి: ఓటీటీలో లాల్‌సింగ్‌ చడ్డా
బస్టాండ్‌లో అపస్మారక స్థితిలో నటుడు, ఆస్పత్రికి తీసుకెళ్లగా

Advertisement
 
Advertisement
Advertisement