నాన్నగారు మా తరతరాలకు గుర్తింపునిచ్చారు | Allu Ramalingaiah 99 Birthday Celebrations | Sakshi
Sakshi News home page

నాన్నగారు మా తరతరాలకు గుర్తింపునిచ్చారు

Published Fri, Oct 2 2020 2:37 AM | Last Updated on Fri, Oct 2 2020 2:37 AM

Allu Ramalingaiah 99 Birthday Celebrations - Sakshi

తెలుగు తెరపై హాస్యపు జల్లు అల్లు రామలింగయ్య. ఆయన మన మధ్య లేకున్నా ఆయన వదిలిన పదాలు, బాడీ లాంగ్వేజ్‌ మరువలేని జ్ఞాపకాలు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించడంతో పాటు చివరి శ్వాస వరకూ నటించి, సినిమాపై తన ప్రేమని చాటుకున్నారు అల్లు రామలింగయ్య. నటుడుగా ఎంత బిజీగా ఉన్నా కూడా తన వృత్తి హోమియోపతిని మాత్రం వదల్లేదు. నిర్మాతగా మారి, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ స్థాపించి అనేక సూపర్‌హిట్స్‌ కూడా అందించారు.

అలాంటి మహానటుడు, నిర్మాత అల్లు రామలింగయ్య జయంతి అక్టోబర్‌ 1న. ఈ సంవత్సరం ఆయన 99వ జయంతి.  ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య తనయుడు, నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ –‘‘మా నాన్న తర్వాత నేను, నా తర్వాత మా అబ్బాయిలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాం. ఈ మధ్య నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళితే అక్కడ ఒకావిడ నన్ను చూసి, ‘నమస్కారం అరవింద్‌గారు’ అని పలకరించారు. అక్కడే ఉన్న వాళ్ల అమ్మకి అల్లు రామలింగయ్యగారి అబ్బాయి అని పరిచయం చేశారావిడ. నాన్నగారు తరతరాలకు మా ఫ్యామిలీకి గుర్తింపునిచ్చారు’’ అన్నారు.

అల్లు స్టూడియో
అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు వెంకటేష్, అల్లు అర్జు¯Œ , అల్లు శిరీష్‌ల నిర్వహణలో అల్లు స్టూడియోస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అల్లు స్టూడియోలో ఎలాంటి లేటెస్ట్‌ టెక్నాలజీ ఉండబోతుంది? ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? అనే విషయాలు త్వరలో తెలియజేస్తారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement