
జపాన్ వెళ్లనున్నారట పుష్పరాజ్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘పుష్ప’. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఆల్రెడీ సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మలి భాగం ‘పుష్ప: ది రూల్’ తీస్తున్నారు మేకర్స్. ఈ సినిమా చిత్రీకరణ హైదారాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో జరుగుతోంది.
జాతర నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణను జపాన్‌లో ప్లాన్ చేశారట. ఓ ప్రధాన యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అక్కడి లొకేషన్స్‌లో జరుగుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment