అవసరమైన వారిని గుర్తించి తప్పకుండా సహాయం అందిస్తా: ఆలియా

Alia Bhatt Extends Helping Hand Amid Covid Crisis In India - Sakshi

సామాన్యుల కోసం నేను సైతం అంటున్న బాలీవుడ్‌ భామ ఆలియా

ముంబై : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. అనేక మంది తిండిలేక, వైద్యం అందక అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'మేము సైతం' అంటూ సాయం చేయడానికి అనేక మంది సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇటీవలె గౌత‌మ్ గంభీర్ నిర్వహిస్తున్న స్వ‌చ్చంద సంస్థ‌కు కోటి రూపాయ‌లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా కోవిడ్‌ పేషెంట్ల కోసం  సకల సౌకర్యాలతో వెయ్యిపడకల ఆసుపత్రిని నిర్మిస్తానని హిందీ నటుడు గుర్మీత్‌ చౌదరి ప్రకటించాడు. పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్లను త్వరలోనే ప్రారంభిస్తానని ఆదివారం నాడు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. తాజాగా కరోనాతో అల్లాడిపోతున్న జనాలకు సాయం చేయడానికి హీరోయిన్‌ ఆలియా భట్‌ ముందుకు వచ్చింది.

ఇటీవలె ప్రియుడు రణ్‌బీర్‌తో కలిసి హాలిడే ట్రిప్‌ కోసం మాల్దీవులకు వెళ్లిన ఆలియా రెండు రోజుల క్రితమే ముంబైకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించి అవసరమైన వారికి సహాయం చేస్తానని ప్రకటించింది. జర్నలిస్ట్‌ ఫయే డిసౌజాతో కలిసి కోవిడ్‌ పేషెంట్లు ఎంత మంది ఉన్నారు?

ఎవరెవరికి తక్షణ సహాయం అందాల్సి ఉంది వంటి వివరాలను సేకరించి వారికి సహాయం చేస్తానని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆలియా ప్రకటించింది. కాగా ఆలియా- రణ్‌బీర్‌, టైగర్‌ ష్రాఫ్‌-దిశా పటానీ సహా పలువురు సెలబ్రిటీలు మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లడం పట్ల నెటిజన్లు నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. 'కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’అంటూ నెటిజన్లు ట్రోల్స్‌ చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి :  'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి'
కరోనా పేషెంట్ల కోసం వెయ్యి పడకల ఆస్పత్రి: నటుడు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top