‘అంధధూన్’‌ రీమేక్‌కు ఐశ్వర్యను సంప్రదించాం: నిర్మాత

Aishwarya Rai May Acting In Andhadhun Tamil Remake With Prashanth - Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అంధధూన్’‌ తమిళ రీమేక్‌లో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో అయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్నట్లు సినీయర్‌ హీరో ప్రశాంత్‌ తండ్రి, నిర్మాత తియగరాజన్‌ తెలిపారు. ఈ రీమేక్‌లో ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే బాలీవుడ్‌లో‌ బ్లక్‌‌బస్టర్‌గా నిలిచిన ‘అంధధూన్’‌లో టబు కీలక పాత్ర పోషించారు. దీంతో తమిళ రిమేక్‌కు టబు పాత్రకు గాను ఐశ్వర్యరాయ్‌ను సంప్రదించినట్లు నిర్మాత తియగరాజన్‌ చెప్పారు. ఆయన ఓ జాతీయా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో టబు పాత్ర కోసం ఐశ్వర్యరాయ్‌తో చర్చలు జరుపుతున్నాం. అయితే ఇప్పటి వరకు తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ తను ఓకే చెబితే మాత్రం దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రశాంత్‌, ఐశ్వర్యలు కలిసి పని చేస్తారు’ అంటూ చెప్పకోచ్చారు. (చదవండి: నితిన్‌ రీమేక్‌ మూవీ: డైరెక్టర్‌..)

1998లో ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జీన్స్‌’ సినిమాలో ప్రశాంత్‌, ఐశ్వర్యలు హీరో, హీరోయిన్‌లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లక్‌బస్టర్‌గా నిలిచింది. ఇటీవల తెలుగులో వచ్చిన ‘వినయ విధేయ రామ’లో ప్రశాంత్‌ రామ్‌ చరణ్‌కు అన్నగా నటించిన విషయం తెలిసిందే. అయితే ‘అంధధూన్’‌ తమిళ రిమేక్‌లో మరో ముఖ్య పాత్రల కోసం ప్రముఖ నటుడు కార్తీక్‌, హాస్యనటుడు యోగిలను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చినప్పటికి కార్తీక్ పాత్ర ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా కోసం ప్రశాంత్‌ 23 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ 2018లో ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో విడుదలైన ‘అంధధూన్’ చిత్రం బీ-టౌన్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో అంధుడిగా ఆయుష్మాన్‌ నటనకు విమర్శకు నుంచి ప్రశంసలు అందుకుంది. అంతేగాక తన పాత్రకు ఉత్తమ నటుడిగా కూడా ఎన్నికయ్యాడు. అలాగే తెలుగులో కూడా రీమేక్‌ కానున్న ‘అంధధూన్‌’లో హీరో నితిన్‌ నటిస్తున్నాడు. శ్రేష్ట్‌ మూవీస్ పతాకంలో‌ తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. (చదవండి: 21 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ.. అయితే ఏంటి?!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top