ముద్దుకు ముందు ‘మీరు ఏమిట్లు’.. దర్శకుడు క్లారిటీ | Aditya Hasan Clarity About Dialogues of Epic Movie Teaser | Sakshi
Sakshi News home page

Epic Teaser: ముద్దుకు ముందు ‘మీరు ఏమిట్లు..’..దర్శకుడు క్లారిటీ

Apr 29 2026 7:55 PM | Updated on Apr 29 2026 8:14 PM

Aditya Hasan Clarity About Dialogues of Epic Movie Teaser

‘బేబీ’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన మరో చిత్రం ‘ఎపిక్‌- ఫస్ట్‌ సెమిస్టర్‌’ .  ‘#90s: ఏ మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌’ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ తాజాగా రిలీజ్‌ అయింది. ‘#90s’లోని ఆదిత్య పాత్ర పెరిగి పెద్దయ్యాక..ఇంట్లో వాళ్ల ఒత్తిడితో యూకేకి వెళ్లి, అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడితే ఏం జరిగిందన్న పాయింట్‌తో ఈ సినిమా రూపొందించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. 

మంచి రొమాటిక్‌ సీన్లతో టీజర్‌ని కట్‌ చేశారు. అయితే ఇందులో కులం, మతానికి సంబంధించిన డైలాగులు ఉండడం గమనార్హం. ముద్దు పెట్టుకునే క్రమంలో ‘మీరు ఏమిట్లు’ అని హీరోని హీరోయిన్‌ ప్రశ్నించడం.. మరోచోట హీరో తన పేరుని చెబుతూ..‘ఆదిత్య..హిందువు’ అని చెప్పడం టీజర్‌లో చూపించారు. దీంతో సినిమా మొత్తం కులం, మతం చుట్టూనే తిరుగుతుందేమో అనే సందేహాన్ని ఓ విలేకరి దర్శకుడి ముందు వెలిబుచ్చగా, ఆయన  క్లారిటీ ఇచ్చాడు.

ఎపిక్‌ మూవీ టీజర్‌ రిలీజ్‌ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్‌. ఈ సందర్భంగా ‘మీరు ఏమిట్లు..’అనే డైలాగు పెట్టారు. సినిమాలో కులం, మతం ప్రస్తావన ఉంటుందా?’అని దర్శకుడిని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి దర్శకుడు ఆదిత్య హాసన్‌ సమాధానం చెబుతూ..‘సినిమాలో కామెడీగానే ఆ డైలాగులు పెట్టాం. ఎక్కడా కుల మతాలను కించపరిచే సన్నివేశాలు ఉండవు. క్యాస్ట్‌పై వేసే జోకులు కూడా క్లీన్‌గానే ఉంటాయి. కాంట్రవర్సీ ఏం ఉండదు. ఒక కులాన్ని కానీ, మతాన్ని కానీ కించపరిచే సన్నివేశాలేవి మా సినిమాలో ఉండవు’ అని చెప్పాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement