ప్రముఖ నటి పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారనే కథనాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రా (దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు)తో ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు కొంత కాలంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాగజైన్ ఫిల్మ్‌ఫేర్ సంస్థ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారనే వార్త నిజమేనంటూ తమ వద్ద సరైన ఆధారం కూడా ఉందని ఆ సంస్థ పేర్కొంది.

పూజా హెగ్డే, రోహన్ మెహ్రా తరుచుగా పలుమార్లు కలిసి కనిపించిన సందర్భాలు ఉన్నాయి. వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఇంతకాలం అది కేవలం రూమర్‌గానే ఉండేది. కానీ, ఫిల్మ్‌ఫేర్ లాంటి సంస్థ ఈ వార్తను ప్రచురించడంతో దాదాపు నిజమే ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. అయితే , ఈ అంశం గురించి వారిద్దరూ ఇంకా స్పందించలేదు. రోహన్ మెహ్రా (Rohan Mehra) 2018లో 'బజార్' (Baazaar) చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత 420 IPC, అద్భుత్ వంటి చిత్రాలతో పాటు, కాళ (Kaala) వంటి వెబ్ సిరీస్‌లలో నటించి గుర్తింపు పొందారు.


