
తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్(Nivetha Pethuraj). త్వరలో వివాహం చేసుకోబోబుతున్నట్లు ప్రకటించేశారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా ఫోటోలు షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే వారికి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.
నివేదకు కాబోయే భర్త పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్.. అతను దుబాయ్‌లో బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. కొంతకాలంగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, ఈ విషయం బయటిప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఏకంగా ఎంగేజ్‌మెంట్ తర్వాత అందరికీ శుభవార్త చెప్పారు. ఇదే ఏడాదిలో వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయం గురించి మరిన్ని విషయాలు ఆమె చెప్పనున్నారు.

తమిళనాడుకు చెందిన నివేతా పేతురాజ్.. 2016లో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదే 'మెంటల్ మదిలో' అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం తదితర సినిమాలు చేసింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత పేరు అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే ఈమె ఏం మూవీస్ చేస్తుందనేది తెలీదు.
కారు రేసర్‌గా విజయం.. సీఎం స్టాలిన్ కుమారుడితో రూమర్స్
నటన-మోడలింగ్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కారు రేసింగ్‌లో కూడా సత్తా చాటింది. మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్‌షిప్ పోటీలోని మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

నివేదా పేతురాజ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ వచ్చాయి. ఆమె కోసం ఉదయనిధి స్టాలిన్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఇదే విషయమై తమిళ సినీ ఇండస్ట్రీకి ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న నివేదా పేతురాజ్ ఘాటుగా స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనంటూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. తప్పుడు వార్తలతో బుద్దిలేని కొందరు వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసే ముందు వారు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి కొంతైనా మానవత్వంతో ఉంటారని భావించానని చెప్పింది.