Actress Nayanthara Planning To Buy Theatre In Chennai - Sakshi
Sakshi News home page

Nayanthara: మరో వ్యాపారరంగంలోకి లేడీ సూపర్‌స్టార్‌ నయనతార

May 21 2023 8:50 AM | Updated on May 21 2023 11:49 AM

Actress Nayanthara Planning To Buy Theatre In Tamilnadu - Sakshi

దక్షిణాదిలో అగ్ర కథానాయక రాణిస్తున్న నటి నయనతార. అత్యధికంగా రూ. 10 కోట్లు పారితోషికం తీసుకుంటున్న నటి ఈమె అని సమాచారం. జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నయనతార నిర్మాతగానూ మారి రౌడీ పిక్చర్స్‌ పలు చిత్రాలు నిర్మిస్తూ బయటవారి చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేస్తున్న విషయం తెలిసింది. అదే విధంగా పలు వ్యాపారాలు చేస్తూ ఆ రంగులోనూ రాణిస్తున్నారు.

సమీపకాలంలో వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న నయనతార ఇప్పుడు థియేటర్‌ అధినేతగాను అవతారం ఎత్తనున్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు నటుడు శివాజీ గణేషన్‌, నాగేశ్‌, ఏవీఎం శెట్టియార్‌ వంటి వారు థియేటర్‌ అధినేతలుగా రాణించారు. కాగా పలు ప్రసిద్ధి చెందిన థియేటర్లు మూత పడుతున్న కాలం ఇది. చదవండి: పొన్నియిన్‌ సెల్వన్‌తో సూపర్‌ క్రేజ్‌.. త్రిషకు మరో సూపర్‌ ఛాన్స్‌

మరి కొన్ని థియేటర్లు మాల్స్‌తో కూడిన మల్టీ ఫ్లెక్సీ థియేటర్లుగా మారుతున్నాయి. అలా చైన్నెలో ఇటీవల మూత పడ్డ థియేటర్‌ అగస్త్య. ఇప్పుడు దీని రూపం మారబోతోందని సమాచారం. దీన్ని నటి నయనతార కొనుగోలు చేసి మాల్స్‌తో కూడిన మల్టీప్లెక్స్‌ థియేటర్‌గా మార్చే ప్రయత్నంతో ఉన్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement