తండ్రిగా ప్రమోషన్‌ పొందిన 12th ఫెయిల్‌ హీరో | Sakshi
Sakshi News home page

Vikrant Massey- Sheetal Thakur: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్‌ నటి

Published Thu, Feb 8 2024 9:57 AM

Vikrant Massey And Sheetal Thakur Welcome Baby Boy, Shares Post - Sakshi

12th ఫెయిల్‌ సినిమా హీరో విక్రాంత్‌ మాస్సే గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తన భార్య షీతల్‌ ఠాకూర్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు. బుధవానం (ఫిబ్రవరి 7న) సోషల్‌ మీడియా వేదికగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు విక్రాంత్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అప్పుడే లవ్‌లో పడ్డారు
12th ఫెయిల్‌ హీరోయిన్‌ మేధా శంకర్‌ సైతం కంగ్రాట్స్‌ అంటూ అతడి పోస్ట్‌ కింద కామెంట్‌ పెట్టింది. కాగా షీతల్‌ కూడా పలు సినిమాల్లో నటించింది. వీరిద్దరూ బ్రోకెన్‌ బట్‌ బ్యూటిఫుల్‌ వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌ చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామోచ్‌ అంటూ షీతల్‌ గర్భవతి అయిన విషయాన్ని బయటపెట్టారు.

సీరియల్స్‌ నుంచి సినిమాల్లోకి..
కాగా విక్రాంత్‌ మాస్సే నేరుగా సినిమాల్లో అడుగుపెట్టలేదు. మొదట్లో బుల్లితెరపై సీరియల్స్‌ చేశాడు. ధరమ్‌ వీర్‌, బాలికా వధు(చిన్నారి పెళ్లికూతురు), గుమ్రా: ఎండ్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌.. ఇలా పలు ధారావాహికల్లో నటించాడు. తర్వాత అక్కడ వచ్చిన క్రేజ్‌ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. లూటేరా, దిల్‌ ధడక్నే దో, హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించాడు.

ఎ డెత్‌ ఇన్‌ ద గంజ్‌తో హీరోగా మారాడు. ఈ మూవీ అతడి జీవితాన్నే మార్చేసింది. అప్పటినుంచి డిఫరెంట్‌ కాన్సెప్టులు ఎంచుకుంటూ హీరోగా రాణిస్తున్నాడు. 12th ఫెయిల్‌ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డు (క్రిటిక్స్‌ విభాగంలో) అందుకున్నాడు.

చదవండి: ఆ తమన్‌ అబద్ధాలే చెప్తాడు.. నేను అలా ఒక్కసారే చేశా!

Advertisement
 
Advertisement
 
Advertisement