
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించనున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు అర్జున్ దాస్ తెలుగుకు పరిచయమవుతున్నారు. శౌరి చంద్రశేఖర్ టి. రమేష్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దేవుడి చిత్రపటాలపై దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చిన క్లాప్‌తో ఈ సినిమా ప్రారంభమైంది. నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) చిత్రం స్క్రిప్టును దర్శకుడికి అందించారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ప్రేమలోని పలు సున్నితమైన పార్శా్వలను స్పృశిస్తూ చిత్ర కథా కథనాలు ఉంటాయి. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టి.రమేష్.