ఇండియన్‌ సినిమాలో సెటిలైన విదేశీ యాక్టర్‌! | Actor Jason Shah Acts In Bollywood | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ సినిమాలో షైన్‌ అవుతున్న విదేశీ నటుడు.. మొన్న సలార్‌.. ఇప్పుడేమో!

Published Thu, Jun 13 2024 12:05 PM | Last Updated on Thu, Jun 13 2024 12:23 PM

Actor Jason Shah Acts In Bollywood

భారతీయ సినిమా ఇప్పుడు ఖండాలు దాటి పరుగులు తీస్తోంది. భాషా భేదం లేదు.. ప్రతిభే ప్రామాణికం. అందుకే విదేశీ నటీనటులు కూడా భారతీయ చిత్రాల్లో నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ కోవకు చెందిన నటుడే జేసన్‌ షా. విదేశం (ఐర్‌ల్యాండ్‌)లో పుట్టి పెరిగిన ఈయన ఇండియాలో నటుడిగా రాణిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌ ఫిలిం అకాడమిలో నటనలో శిక్షణ పొందిన జేసన్‌షా భారతీయ సినిమాల్లో నటించడం విశేషం. 

మొదట్లో ఇక్కడ టీవీ సీరియళ్లలో ప్రతినాయకుడిగా నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ తరువాత సినీ రంగప్రవేశం చేసి హిందీ, తమిళ భాషల్లో నటించి పేరు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా తమిళంలో 1947 ఆగస్టు 16, కన్జూరింగ్‌ కన్నప్పన్‌, మిషన్‌ చాప్టర్‌ 1 వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి వెబ్‌ సిరీస్‌లో ముఖ్య భూమికను పోషించి ప్రశంసలు అందుకున్నారు. 

సలార్‌ సినిమాలోనూ మెప్పించాడు. తాజాగా నటి అలియా భట్‌ కథానాయకిగా నటించిన జిగ్రా చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇలా విదేశీ నటుడైన జేసన్‌షా భారతీయ చిత్రాల్లో నటుడిగా రాణించడం విశేషమనే చెప్పుకోవాలి.

చదవండి: నటి హేమకు బెయిలు మంజూరు చేసిన కోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement